మనకు బాగా దగ్గరగా ఉన్నవాళ్లు మరణిస్తే వాళ్ళ మరణాన్ని మనం అసలు తట్టుకోలేం..  అలానే బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యను జీర్ణించుకోలేక సుశాంత్ వదినా నీరసంతో సోమవారం మరణించింది. అయితే సుశాంత్ ఆత్మహత్యను ఒక్క వాళ్ళ వదినే కాదు బాలీవుడ్ అభిమానులు కూడా జీర్ణించుకోలేక పోతున్నారు. ఎంతోమంది వారి బాధను సోషల్ మీడియా ద్వారా తెలుపుతున్నారు. కొందరు అయితే సుశాంత్ ఆత్మహత్య బాలీవుడ్ లో గాడ్ ఫాథర్స్ వల్లే జరిగింది అని నిందిస్తుంన్నారు. 

 

IHG

 

ఇంకా అలాంటి ఈ సమయంలోనే  తాజాగా తన అభిమాన హీరో ఆత్మహత్య చేసుకున్నందుకు ఎంతగానో కలత చెందిన సుశాంత్ అభిమాని సూసైడ్ చేసుకున్నాడు. ఈ దారుణమైన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని బరేలిలో చోటు చేసుకుంది. ఉత్తర్ ప్రదేశ్ కి చెందిన అభిమాని సుశాంత్‌కి వీరాభిమాని. పదవ తరగతి చదువుతున్న ఈ పిల్లాడికి సుశాంత్‌ ను ఎంతగానో ఆరాధిస్తాడు. 

 

IHG

 

అయితే తన అభిమాన హీరో ఆత్మహత్య చేసుకున్నాడు అని తెలిసి సూసైడ్ లెటర్ రాసి అభిమాని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ లెటర్‌లో నా హీరో ఆత్మహత్య చేసుకోగా లేనిది నేను చేసుకోలేనా అంటూ రాసి ఆ అభిమాని ఆత్మహత్య చేసుకున్నాడు అని పోలీసులు తెలిపారు. దీంతో ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

 

IHG

 

అయితే సుశాంత్ ఆత్మహత్యను ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు సుశాంత సినిమాలు చుసిన ప్రతి ఒక్కరు సుశాంత్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఏది ఏమైనా ఎన్ని సమస్యలు ఉన్న దానికి చావే పరిష్కారం కాదు. కాస్త నెమ్మదిగా అలోచించి ఉంటే ఈ దారుణం జరిగి ఉండేది కాదు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: