నాగార్జున, అనుష్క‌.. ఈ జోడీకి టాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. నాగార్జున హీరోగా డాషింగ్ పూరి జగన్నాథ్ తెర‌కెక్కిన `సూపర్` సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బెంగళూరు భామ అనుష్క టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. సూప‌ర్ సినిమా త‌ర్వాత ఎన్నో వైవిధ్యమైన కథలతో మెప్పించిన స్వీటీ .. దక్షిణాది సినీ పరిశ్రమలో అందరి ఫేవరేట్ అయిపోయింది. ఈ క్ర‌మంలోనే నాగార్జున తోనూ పలు సినిమాల్లో నటించి అందరినీ మెప్పించింది. అస‌లు వీళ్ల జంట‌ చూడ‌గానే సూప‌ర్ అంటారు ప్రేక్ష‌కులు. 

IHG

అయితే ఇక్క‌డ మ‌రో విష‌యం ఏంటంటే.. వీరిద్ద‌రి కాంబినే ష‌న్ లో ఇప్ప‌టి వ‌ర‌కు బ్లాక్ బ‌స్ట‌ర్ ఏదీ లేదు. కానీ నాగ్, అనుష్క క‌లిసి న‌టిస్తే ఏదో తెలియ‌ని మ్యాజిక్ ఉంటుంద‌ని అంటారు ప్రేక్ష‌కులు. ఎందుకంటే.. స్క్రీన్ పై వీళ్ల కెమిస్ట్రీ, వీళ్ల ల‌వ్ ట్రాక్ ఓ రేంజ్‌లో ఆక‌ట్టుకుంటాయి. అందుకే నాగార్జున పక్కన అనుష్క‌ హీరోయిన్‌గా కనిపిస్తే చాలు ఈలలు గోలలో థియేటర్ మొత్తం దద్దరిల్లిపోతాయి. సూప‌ర్ సినిమా త‌ర్వాత వీరిద్ద‌రూ డాన్, ఢ‌మరుకం లాంటి సినిమాల్లో క‌లిసి న‌టించారు. 

IHG

ఈ సినిమాల్లో నాగార్జున అనుష్క మధ్య రొమాంటిక్ సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. మ‌రియు స్క్రీన్ పై వీళ్ల ల‌వ్ స్టోరీ అంటే జ‌నాలు ఫిదా అవ్వాల్సిందే అన్న రితీలో ఉంటుంది. అలాగే నాగార్జున్ హీరోగా వ‌చ్చిన కింగ్‌, సోగ్గాడే చిన్నినాయ‌నా వంటి సినిమాల్లో అనుష్క గెస్ట్ రోల్‌లో కూడా చేసింది. దీంతో ఈ జోడీకి తెలియ‌కుండానే బాగా క్రేజ్ వ‌చ్చేసింది. ఈ క్ర‌మంలోనే అప్ప‌ట్లో వీళ్ళ‌పై వ‌చ్చిన కొన్ని రూమ‌ర్లు కూడా ఈ జోడీకి క్రేజ్ పెర‌గ‌డానికి హెల్ప్ అయ్యాయి. అయితే కార‌ణాలు ఏంటో తెలియ‌దు కాని..  కొన్నేళ్ల నుంచి నాగ్ తో అనుష్క క‌లిసి న‌టించ‌లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: