మన తెలుగులో ఏదైనా చిన్న వార్త వస్తే చాలు దాని గురించి జనాలు ఒకటికి వంద రాస్తూ ఉంటారు. ఒక్క వార్తకు ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు అనే చెప్పాలి. సినిమా వాళ్లకు సంబంధించి ఏ వార్త వచ్చినా సరే మీడియా కు ముందు నుంచి ఒక ఆసక్తి అనేది ఉంటుంది. ఇటీవల అనుష్క క్రికెటర్ ని పెళ్లి చేసుకుంటుంది అని ఒక ప్రచారం జరిగింది. ఆ తర్వాత దర్శకుడు రాఘవేంద్ర రావు కుమారుడు ప్రకాష్ ని వివాహం చేసుకుంటుంది అనే వార్త కూడా వచ్చింది. ఈ రెండు వార్తలను ఆమె ఖండించింది. కాని  ఇది నిజం అని అంటుంది టాలీవుడ్ తో పాటు మీడియా. 

 

ప్రకాష్ ని ఆమె పెళ్లి చేసుకోవడం ఖాయమని వారి వివాహం దాదాపుగా ఖరారు అయిందని అనుష్క చేతిలో ఉన్న సినిమాలను పూర్తి అయిన తర్వాత ఆమె ఈ వివాహం చేసుకునే అవకాశం ఉంది అని ప్రచారం జరుగుతుంది. టాలీవుడ్ లో ఇప్పుడు ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది. చిత్ర షూటింగ్ లో ఆమె బిజీ గా ఉందని ఒక సినిమాను ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అని ఆ సినిమాకు ఆమె నిర్మాత అని అందుకే ఇప్పుడు ఈ వివాహాన్ని ఆమె వాయిదా వేస్తుంది అని అంటున్నారు. ఇక త్వరలోనే అనుష్క ఎంగేజ్మెంట్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి అని టాలీవుడ్ లో టాక్ వినపడుతుంది. త్వరలోనే దీనికి సంబంధించి ప్రకటన కూడా వస్తుంది అని అంటున్నారు. 

 

ఇక దీని మీద ఆమె ఏ విధంగా స్పందిస్తుంది అనేది చూడాలి. ఇటీవల ఆమె నటించిన ఒక సినిమా కరోనా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: