సాధార‌ణంగా ఆన్‌స్క్రీన్‌పై కొంద‌రు హీరో, హీరోయిన్ల మ‌ధ్య‌ కెమిస్ట్రీ, ల‌వ్ ట్రాక్‌ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటాయి. ఈ క్ర‌మంలోనే మ‌ళ్లీ మ‌ళ్లీ ఓ జోడీని స్క్రీన్‌పై చూడాల‌ని కోరుకుంటారు ప్రేక్ష‌కులు. ఇక హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ కరెక్ట్ గా కుదిరితే ఇక వారి నెక్ట్స్‌ సినిమాలపై అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. 

IHG

అయితే ప్రేక్ష‌కులు మెచ్చే జోడీల్లో రామ్ చరణ్‌, రకుల్ ప్రీత్ సింగ్ ఖ‌చ్చితంగా ఉంటారు. గతంలో రకుల్‌ ప్రీత్‌సింగ్, రామ్‌ చరణ్‌ కాంబినేషన్‌లో రెండు సినిమాలు వచ్చాయి. ఆ రెండింట్లోశ్రీను వైట్ల దర్శకత్వంలో వ‌చ్చిన‌ బ్రూస్‌లీ చిత్రం నిరాశపరిచినా.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ధృవ మాత్రం సూపర్‌ డూపర్‌ హిట్‌ అయ్యింది. రిజల్ట్ ఎలా ఉన్నా రెండు సినిమాల‌తో ఈ పెయిర్‌కి సూపర్‌ పెయిర్‌ అని పేరొచ్చింది. 

IHG

రామ్ చరణ్, రకుల్ ప్రీత్ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో అల‌రిచింది. అందుకే వీరి కాంబోలో మ‌రో సినిమా వ‌స్తే బాగుంటుంద‌ని ఎంద‌రో ప్రేక్ష‌కులు కోరుకుంటున్నారు. కాగా, ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ రాజ‌మౌళి ద‌ర్శక‌త్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇక టాలీవుడ్ లో ఒక‌ప్పుడు గోల్డెన్ లెగ్ అని పేరు తెచ్చుకున్న ర‌కుల్ ప్రీత్ సింగ్‌కు ప్ర‌స్తుతం తెలుగులో అవకాశాలు బొత్తిగా కరువయిపోయాయి. 

IHG's a perfect treat for action lovers and ...

కోలీవుడ్ లో ఛాన్సులు బాగానే ఒడిసిపట్టుకుంటోంది కానీ.. తెలుగుకు వచ్చేసరికి పెద్ద‌గా అవ‌కాశాలు రావ‌డం లేదు. ప్ర‌స్తుతం క‌రోనా కార‌ణంగా ఇంట్లోనే ఉంటున్న ఈ బ్యూటి హాట్ హాట్ అందాల‌తో సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: