కీర్తి సురేష్. మహానటి. అవును ఆమె నటనా కౌశలాన్ని అంతా చూశారు. కీర్తిని అలనాటి మహా నటశిరోమణి సావిత్రి పూనేసింది. అందుకే అందంగానే కాదు, అభినయంతో కూడా అదుర్స్ అనిపించింది. కీర్తి సురేష్ అంతవరకూ ఎలా ఉందో ఎవరికీ  తెలియదు కానీ ఆ తరువాత మాత్రం కంప్లీట్ సెలెక్టివ్ అయిపోయింది. అన్ని రకాల పాత్రలూ వేస్తే నంబర్ వన్ రేసులో ఉంటారు.

IHG

స్టార్ హీరోయిన్ గా రాణిస్తారు. కానీ కీర్తి మాత్రం చిరకాల‌ కీర్తినే కోరుకుంటోంది. అందుకే ఆమె మంచి నటన ఉన్న పాత్రలనే ఎంపిక చేసుకుంటోంది. అయితే కీర్తికి అభినయానికి తగిన పాత్రలను టాప్ హీరోల సినిమాలో కూడా ఆఫర్ చేస్తున్నారు.

IHG

కానీ కీర్తి మాత్రం ఎందుకో ఎస్ అని చెప్పడంలేదు. మహేష్ బాబు, పరశురాం మూవీలో కూడా కీర్తిని అడుగుతున్నట్లుగా టాక్ వచ్చింది. అయితే సూపర్ స్టార్ పక్కన నటించడానికి కీర్తి ఎందుకో ఓకే చెప్పినట్లుగా లేదు. అలాగని నో అనడంలేదు. దాంతో కీర్తి ఆలోచనలు ఏంటి అని అంతా ఆలోచిస్తున్నారుట.

IHG

నిజానికి కీర్తి వంటి హీరోయిన్ కి టాప్ హీరోల పక్కన ఆఫర్లు వస్తే వాటిని జాగ్రత్తగా వాడుకోవాలి. సూపర్ స్టార్ డంని ఎంజాయ్ చేయాలి. కానీ కీర్తి మాత్రం సెపరేట్ గా థింక్ చేస్తోంది అంటున్నారు. తాను మాత్రమే కనిపించే పాత్రలనే ఆమె కోరుకుంటోంది అంటున్నారు. 

IHG

దాంతోనే స్టార్ హీరోల సినిమాల పట్ల కూడా అసక్తి చూపించడం లేదు అంటున్నారు మొత్తానికి కీర్తి సురేష్ కెరీర్ ఇలా లేడీ ఓరియెంటెండ్ మూవీస్ తోనే సాగుతుందా అన్న డౌట్లు కూడా వస్తున్నాయి. మరి చూడాలి కీర్తి టాప్ హీరోల పక్కన జత కట్టాలని  సైన్ చేస్తుందో లేదో.

మరింత సమాచారం తెలుసుకోండి: