సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు ముందునుండి కరోనా వైరస్ విషయంలో పరిస్థితులను ఏవిధంగా హ్యాండిల్ చెయ్యాలి అనేదాన్ని విషయంలో పర్ఫెక్ట్ క్లారిటీ తో ఉన్నారు. ఈ వైరస్ వల్ల ప్రపంచ దేశాలలో సినిమా థియేటర్లు ఓపెన్ అయి మళ్లీ క్లోజ్ అయిన పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తూ అటువంటి పరిస్థితి తెలుగు రాష్ట్రాల్లో జరగకూడదని, పక్కా ప్లానింగ్ తో పర్ఫెక్ట్ ఆలోచనలతో ముందుకు దూసుకుపోతున్నారు. ఇండస్ట్రీలో పెద్దగా ఉంటూ సరైన సమయంలో సినిమాలు విడుదల చేయటం విషయంలో కీలక సూచనలు ఇస్తున్నారు. అలాగే తన బ్యానర్ లో ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ‘నారప్ప’, ‘హిరణ్య కశ్యప’.. ‘సోను కే టిటు కి స్వీటీ’, ‘డ్రీమ్ గర్ల్’ సినిమాలు ఎప్పుడు మొదలు పెట్టాలి అన్న దాని విషయంలో కమర్షియల్ గా కాకుండా మానవతా దృక్పథంతో సురేష్ బాబు తీసుకుంటున్న నిర్ణయాలకు ఫిలిం నగర్ వర్గాల నుండి ప్రశంసలు అందుతున్నాయి.

 

ఇక గతేడాది ‘ఓ బేబీ’ ‘వెంకీమామ’ సినిమాలని రూపొందించి మంచి కమర్షియల్ సక్సస్ లను అందుకున్న సురేష్ ప్రొడక్షన్స్ లో ‘నారప్ప’ కూడా భారీ సక్సస్ ని అందుకోబోతుందన్న ధిమాతో ఉన్నారు. మరోపక్క పెద్దకొడుకు రానా దగ్గుబాటి వివాహం ఆగస్టు లో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో పెళ్లి పనుల విషయంలో ప్రస్తుతం సురేష్ బాబు బిజీగా బిజీగా ఉన్నట్లు టాక్. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం తీవ్ర స్థాయిలో ఉన్న తరుణంలో షూటింగ్ ఎప్పుడు మొదలుపెట్టాలి..?, సినిమాలు ఎలా రిలీజ్ చేయాలి...? అనే విషయంలో సురేష్ బాబు కి ఉన్న క్లారిటీ టాలీవుడ్ ఇండస్ట్రీలో మరొకరికి లేదని వార్తలు అందుతున్నాయి.

 

ప్రజెంట్ నాలుగు నెలలు మాత్రం షూటింగ్ లు జరిగిన…. సినిమా ధియేటర్ లో మాత్రం ఓపెన్  చేయకూడదు అనే ఆలోచనలో సురేష్ బాబు ఉన్నట్లు వార్తలు అందుతున్నాయి. ఎందుకంటే ఇటీవల ఒక దేశంలో లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే వారం రోజుల తర్వాత సినిమా థియేటర్లు ఓపెన్ చేస్తే మళ్లీ వైరస్ ప్రభావం పెరగటంతో… ఇప్పుడు ఆ దేశంలో సినిమా ధియేటర్ వ్యాపారం డేంజర్ జోన్ లో పడిందట. ఫలితంగా ఆ దేశంలో సినిమా నిర్మాతలు తీవ్ర నష్టాలూ ఎదుర్కోబోతున్నారట. దీంతో అటువంటి పరిస్థితి ఇక్కడ రాకూడదని సురేష్ బాబు సినిమా ధియేటర్ ఓపెన్ చేసే విషయంలో చాలా కీలకంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: