ఒకప్పుడు నిన్నటి తరం మొన్నటి తరంలో హీరోయిన్ లుగా  నటించి ఎంతగానో గుర్తింపు సంపాదించిన వారు నేటితరంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి తమ నటనతో ఆకట్టుకున్న వారు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో నిన్నటి మొన్నటి తరం హీరోయిన్లు  నేటితరంలో ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.ఇలా మొన్నటి  తరంలో హీరోయిన్ గా ఎంతగానో గుర్తింపు సంపాదించి నేటితరంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన నటనతో తెలుగు ప్రేక్షకులందరికీ ఫిదా చేస్తున్న నటి లక్ష్మి. ఈ మధ్యకాలంలో తెలుగు ప్రేక్షకులందరూ లక్ష్మి నటనకు ఫిదా అయ్యారు అని చెప్పాలి. 

 


 లక్ష్మీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆమె కెరీర్లో గుర్తుండిపోయే ఎన్నో పాత్రల్లో నటించారు. అయితే లక్ష్మీ నటించిన పాత్రల్లో  తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్ర ఓ బేబీ  సినిమాలో  లక్ష్మి పోషించిన పాత్ర. సమంత హీరోయిన్ గా నందినీ రెడ్డి దర్శకత్వంలో కొరియన్ మూవీ మిస్ గ్రానీ తెలుగు రీమేక్ గా  తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఓ బేబీ, ఈ సినిమా సమంత కెరీర్లో ఎంత మంచి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే సమంత పాత్రలో లక్ష్మీ నటించింది అనడంకంటే లక్ష్మీ పాత్రలోనే సమంత నటించింది అనడం బెటరేమో, 

 

 వృద్ధురాలి గా ఉన్న లక్ష్మి ఓ వరం వల్ల యువతి గా మారి సమంత గా మారుతుంది. ఇదిలా ఉంటే వృద్ధురాలి పాత్రలో  నటించిన లక్ష్మి...  ఇంట్లో పెద్దగా.. నాన్నమ్మ గా.. తల్లిగా.. ఆమె హావభావాలు... పాత్రలో ఆమె ఒదిగిపోయి నటించిన తీరు... ప్రతి ప్రేక్షకుడికి తమ కుటుంబంలోని పెద్దలను గుర్తు చేశాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా లక్ష్మి తన పాత్రలో ఒదిగిపోయి మరి నటించి పాత్రకు ప్రాణం పోసింది. సినిమా చూసినంత సేపు లక్ష్మీ తప్ప ఆ పాత్రలో ఇంకెవరు నటించలేరేమో  అనిపిస్తూ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: