తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్న విషయం తెలిసిందే. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలోని క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరు  నటన విషయంలో ఎవరికి వారే సాటి. తమకు సరైన పాత్ర వచ్చినప్పుడు తమలోని నటుణ్ణి తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయం చేస్తూ తమ నటనతో ప్రేక్షకులను ఫిదా చేస్తూ ఉంటారు క్యారెక్టర్ ఆర్టిస్టులు, ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో వైవిధ్యమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్ అయిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో  ముందు వరుసలో ఉంటారు నరేష్. ఇప్పటివరకు నరేష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించారు. 

 


 ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించారు. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోయి మరి నటిస్తూ.. నటనతో పాత్రకు ప్రాణం పోస్తూ ఉంటారు నరేష్. అయితే నరేష్ నటించిన పాత్రలు ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రలు  ఎన్నో అని చెప్పాలి . వీటిలో ఒకటి రంగస్థలం సినిమా లో రామ్ చరణ్ తండ్రి పాత్ర. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా సమంత హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చరణ్ తండ్రి పాత్రలో నటించా నరేష్ . ఈ సినిమాలో దర్జీ గా  నటించారు. 

 


 అయితే రంగస్థలం సినిమా రా కంటెంట్ సినిమా అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాలో రామ్చరణ్ తండ్రిగా నరేష్ పాత్ర ఎంతో అద్భుతంగా వచ్చింది అని చెప్పాలి . రామ్చరణ్ తండ్రిగా నరేష్ నటించిన తీరు  తెలుగు ప్రేక్షకులందరినీ ఫిదా చేసింది. ఎంతో నాచురల్ యాక్టింగ్ తో... పాత్రలో జీవించి మరీ నటించారు నరేష్ . నరేష్ కెరీర్ లో రంగస్థలం లోని రామ్ చరణ్ తండ్రి పాత్ర ఒక మైలురాయిగా నిలిచిపోయింది అనడంలో అతిశయోక్తి లేదు. ఈ పాత్ర తెలుగు ప్రేక్షకులందరి హృదయాల్లో నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: