టాలీవుడ్ ఇండస్ట్రీలో 'మా' అధ్యక్షుడిగా నరేష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత `మా`లో కీలకమైన రాజకీయాలు గ్రూపులు ఏర్పడిన సంగతి అందరికీ తెలిసినదే. బహిరంగంగానే ఒకరిపై ఒకరు గ్రూపు రాజకీయాలు చేస్తూ మీడియా ముందే విమర్శలు కూడా చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా నిధుల గోల్ మాల్ విషయం అయితే ఏకంగా అధ్యక్షుడు పీఠాన్ని కదిలించే విధంగా పరిస్థితి మారింది. ఆ సమయంలో అధ్యక్షుడిగా ఉన్న నరేష్ పై వచ్చిన ఆరోపణల విషయంలో తీవ్రంగా మనస్థాపానికి గురి అయ్యి `మా` కార్యక్రమాలకు చాలావరకు దూరమయ్యారు. అంతేకాకుండా ఇండస్ట్రీకి సంబంధించి ఫంక్షన్స్ కి కూడా నరేష్ చాలావరకు దూరమైపోయారు అనే వార్తలు వచ్చాయి.

IHG's Family!

అదే సమయంలో బెనర్జీ తెరపైకి రావడంతో నరేష్ హడావిడి ‘మా’ లో ఇంకా లేదని అందరూ భావించారు. కానీ ఏమైందో ఏమో తెలియదు గానీ ప్రజంట్ నరేష్ `మా`లో మళ్లీ యాక్టివ్ అయ్యారు. `మా`కి సంబంధించిన చాలా బాధ్యతలను భుజాన వేసుకుని నరేష్ స్పందిస్తున్నారు. అయితే నరేష్ ఈ విధంగా మళ్లీ యాక్టివ్ అవ్వటానికి కారణం మెగాస్టార్ చిరంజీవి అని, ఆయన చొరవ తీసుకుని నరేష్ కి సర్ది చెప్పినట్లు… దీంతో చిరంజీవి సర్దిచెప్పడంతో నరేష్ మళ్లీ `మా` బాధ్యతలను చేపట్టినట్లు ఫిలింనగర్ లో వార్తలు వినబడుతున్నాయి.

IHG

అంతేకాకుండా ప్రతి విషయాన్ని `మా`లో ఉన్న పెద్దలంతా కలిసి చర్చించుకుని అప్పుడు కార్యక్రమం చేపట్టాలని నరేష్ కి చెప్పినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినపడుతున్నాయి. ముఖ్యంగా నరేష్ సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల గొడవలు జరిగాయని ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నరేష్ కి చిరంజీవి తో పాటు ఇండస్ట్రీ పెద్దలు చెప్పటంతో ఆయన ఓకే అన్నట్లు టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: