టాలీవుడ్ లో హీరో గానే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా  మంచి గుర్తింపు తెచ్చుకున్నారు శ్రీహరి. ఆయన హీరో గా చేసిన సినిమాలు ఆయనకు ఎంత పేరు తీసుకొచ్చాయి అనేది పక్కన పెడితే ఆయన నటుడిగా  ఇతర పాత్రల్లో చేసిన సినిమాలు మాత్రం ఆయన స్థాయిని మరో రేంజ్ కి తీసుకుని వెళ్ళాయి అని చెప్పాలి. ఏ పాత్రలో ఆయన నటించినా సరే ఆ పాత్రలో ఆయన జీవిస్తారు అనే మాట మాత్రం వాస్తవం. అగ్ర హీరోల సినిమాల్లో ఆయన చాలా మంచి పాత్రలు చేసారు. విలన్ గా కూడా చాలా మంచి పాత్రలు చేసారు ఆయన. 

 

హీరో కూడా ఆ స్థాయిలో పాత్రలు చేయలేదు. మగధీర సినిమాలో ఆయన చేసిన పాత్ర గాని  మరి కొన్ని సినిమాల్లో ఆయన చేసిన విలన్ పాత్రలు గాని అదే విధంగా వెంకటేష్ సినిమాలో ఆయన పోషించిన కొన్ని పాత్రలు గాని ప్రతీ ఒక్కటి కూడా సినిమాలో హైలెట్ గా ఉంటాయి అనేది వాస్తవం. ఇక హీరోయిన్ కి అన్నగా హీరోయిన్ కి బాబాయి గా ఆయన ఎన్నో  మంచి పాత్రలు చేసారు అని చెప్పాలి. అగ్ర హీరోల సినిమాల్లో ఆయన చేసిన కొన్ని రోల్స్ కి చాలా మంచి అవార్డులు వచ్చాయి అని చెప్పాలి. 

 

ఇప్పుడు టాలీవుడ్ లో ఆయన లేకపోవచ్చు గాని ఆయన పోషించిన పాత్రలు మాత్రం అలాగే ఉన్నాయి అని చెప్పాలి. అగ్ర నటుడిగా ఆయన ఎన్నో కీలక పాత్రల్లో కనిపించారు. ఇక ఇదిలా ఉంటే  ఆయన కోసం డేట్స్  ఆపుకున్న హీరోలు కూడా ఉన్నారు అంటే ఆయన ఏ విధంగా నటించారో అర్ధం చేసుకోవచ్చు. అటు బాలీవుడ్ లో కూడా ఆయన కొన్ని పాత్రల్లో నటించారు. ఆ పాత్రలు కూడా ఆయనకు మంచి పేరు తీసుకొచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: