నాజర్... మన తెలుగులో చాలా తక్కువ కాలంలో స్టార్ నటుడు అయిన నటుడు. తెలుగులోనే కాదు తమిళం లో అయినా సరే ఆయన కచ్చితంగా స్టార్ నటుడు అనేది వాస్తవం. ఆయన ఏ పాత్ర చేసినా సరే ఆ పాత్రకు కచ్చితంగా మంచి గుర్తింపు ఉంటుంది అనే మాట వాస్తవం. ఆయన ఏ సినిమా చేసినా సరే ఆ సినిమాలో ఆయన పాత్ర కచ్చితంగా హైలెట్ అవుతుంది అనే మాట వాస్తవం. అగ్ర హీరోల సినిమాల్లో ఆయన హీరోలకు తాత నుంచి హీరోయిన్ లకు అన్నగా హీరోలకు తండ్రి గా హీరోల పక్కన చేసే చిన్న ఉద్యోగిగా ఎన్నో పాత్రలు పోషించారు. 

 

ఏ పాత్రలో అయినా సరే ఆయన కచ్చితంగా జీవిస్తారు అనేది ఆయన సినిమాలు చూస్తే ఆయన నటనను చూసిన వారు అది నటన అనడం కంటే ఆయన జీవించారు అని అంటారు. ఆ విధంగా ఆయన తెలుగులో చాలా మంచి పాత్రలు చేసారు. తమిళంలో ఇప్పటికి కూడా ఆయనకు మంచి డిమాండ్ అనేది ఉంది. ఇక ఆయన బాహుబలి సినిమాలో చేసిన బిజ్జల దేవా అనే  పాత్ర ఆయనకు చాలా మంచి పేరు తీసుకొచ్చింది. ఆ పాత్రలో ఆయనకు చేయి  ఉండదు సరిగా. అయినా సరే ఆ పాత్రలో ఆయన జీవించారు అని సినిమా చూసిన ఎవరు అయినా చెప్తారు. 

 

ఇక ఆ పాత్రలో ఆయన మినహా ఎవరు నటించినా సరే చికాకుగానే ఉంటుంది అనే విషయం సినిమా చూసిన ఎవరికి అయినా అర్ధమవుతుంది. ఈ తరం నటులకు ఆయన నటన ఆదర్శం. ఎందుకంటే నటనలో ఆయన స్థాయి చూపిస్తారు గాని ఈ పాత్రే చెయ్యాలి అని ఆయన ఎప్పుడు కూడా సినిమాలు చేసిన సందర్భం ఒక్కటి కూడా లేదు అనే చెప్పాలి. అందుకే ఆయనకు డిమాండ్.

మరింత సమాచారం తెలుసుకోండి: