ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా మంది సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉన్నారు. కానీ హీరోయిన్లకు సపోర్టింగ్ రోల్స్ చేస్తూ... వారి వయస్సుకు దగ్గరగా ఉండే యువ క్యారెక్టర్ ఆర్టిస్టులు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు అని చెప్పారు. ముఖ్యంగా ఫిమేల్ యువ క్యారెక్టర్ ఆర్టిస్టులు తెలుగు చిత్ర పరిశ్రమలో తక్కువే. ఉన్న  తక్కువ మందిలో మంచి గుర్తింపు తెచ్చుకొని తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను సంపాదించుకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరంటే ఠక్కున గుర్తొచ్చే పేరు హరితేజ. ఒకప్పుడు బుల్లితెరపై యాంకర్గా అదరగొట్టిన హరితేజ ఆ తర్వాత నటిగా పలు సినిమాల్లో నటించింది. 

 


 అయితే హరితేజ ఎప్పుడూ ఎంతో ఎనర్జిటిక్ గా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. బయట ఎప్పుడూ ఎంతో ఎనర్జిటిక్ గా కనిపించే హరితేజ పాత్రలో ఒదిగిపోయి నటిస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది  ఇప్పటివరకు చాలా  సినిమాలలో హరితేజ తన నటనతో అలరించింది  అనే చెప్పాలి. అయితే హరితేజ ఎనర్జీకి సరిపడే పాత్ర మాత్రం ఏ సినిమాలో రాలేదు. కానీ సరిలేరు నీకెవ్వరు సినిమా లో మాత్రం హరితేజ ఎనర్జీకి సరిగ్గా సరిపోయే పాత్ర వచ్చింది అని చెప్పాలి. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమా ఎంత ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

 


 ఈ సినిమాలో హీరోయిన్ రష్మిక మందన పాత్ర ఎంతో ఎనర్జిటిక్ గా క్యూట్ గా ఉంటుంది. ఇక ఈ సినిమాలో రష్మిక మందన అక్క పాత్రలో  హరితేజ నటిస్తోంది. హరితేజ పాత్ర ఎంతో ఎనర్జీతో ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది. అలాంటి పాత్రలో నటించిన హరితేజ జీవించేసింది అనే చెప్పాలి. అంతేకాదు సరిలేరు నీకెవ్వరు సినిమా లో హరితేజ చేసిన పాత్రలో  హరితేజ ఏకంగా డాన్స్ స్టెప్పులు కూడా వేసి తెలుగు ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది. ఇలా ఇప్పటి వరకూ ఎన్నో పాత్రల్లో నటించిన నటి హరితేజ ఎనర్జీకి సరిపోయే పాత్ర  మాత్రం సరిలేరు నీకెవ్వరు సినిమాలోని వచ్చింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: