ప్రకాష్ రాజ్ అనగానే చాలా మందికి ఆయన చేసే పాత్రలు కళ్ళ ముందు కనపడుతూ ఉంటుంది. చిన్న పాత్ర అయినా పెద్ద పాత్ర అయినా సరే ఆయన చేస్తే ఆయన పాత్రకు కచ్చితంగా అందం అనేది వస్తుంది. ఇక ఆయన  సినిమాలకు నిర్మాతగా, దర్శకుడిగా కూడా ఉండే ఆలోచనలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. అగ్ర హీరోల సినిమాలకు ఆయన గతంలో నిర్మాతగా వ్యవహరించారు కూడా. ఇప్పుడు ఆయన రెండు మూడు సినిమాలను తెలుగులో కూడా నిర్మించే ఆలోచనలో ఉన్నారు అని సమాచారం. ఆయన మెగా హీరో సినిమాకు నిర్మాతగా ఉండే ఆలోచనలో ఉన్నారు అని తెలుస్తుంది. 

 

అది నిజమా కాదా అనేది తెలియదు గాని ఇప్పుడు దీనిపై మాత్రం పెద్ద చర్చ జరుగుతుంది. ఒక కన్నడ దర్శకుడు వరుణ్ తేజ్ తో సినిమా చేస్తాడు అని ఆయన సినిమాకు ఇతను నిర్మాతగా ఉండే ఆలోచనలో ఉన్నారు అనే ప్రచార౦ అయితే జరుగుతుంది. మరి అది ఎంత వరకు నిజమో చూడాలి. ఆయన గతంలో సినిమాలకు నిర్మాత అయినా సరే పూర్తి స్థాయిలో చేయలేదు. ఇక తెలుగులో ఆయన చేయలేదు. ఇప్పుడు తెలుగులో చేసే ఆలోచనలో ఉన్నారు అని తెలుస్తుంది. మరి ఎంత వరకు నిజం అనేది త్వరలోనే స్పష్టత వస్తుంది.

 

కన్నడ దర్శకుడు ఒక కథను రెడీ చేసుకున్నాడు అని దానిని ఇప్పటికే వినిపించారు అని కూడా సమాచారం. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం కూడా ఉంది. బాలీవుడ్ లో కూడా ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఆయన ఉన్నారు అని సమాచార౦. మరి విడుదల చేస్తారా లేదా అనేది చూడాలి. ఇక ఈ సినిమా కన్నడ తమిళ భాషల్లో కూడా వస్తుందని టాక్. చూడాలి మరి ఎప్పుడు తీసుకొస్తారు ఏ విధంగా వస్తుంది అనేది.

మరింత సమాచారం తెలుసుకోండి: