టాలీవుడ్ లో అతడు సినిమా గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. ఈ సినిమా సాధించిన విజయం గురించి పెద్దగా చెప్పకపోయినా ఈ సినిమా స్క్రీన్ మీద పెద్దగ హిట్ అవ్వాకపోయినా సరే బుల్లి తెర మీద మాత్రం సూపర్ హిట్ అయింది అనేది వాస్తవం. ఈ సినిమాలో మహేష్ నటన తో పాటుగా సినిమాలో ఉండే కథ జనాలకు బాగా నచ్చింది అని చెప్పవచ్చు. ప్రతీ సీన్ ని కూడా చాలా అందంగా తీసాడు దర్శకుడు త్రివిక్రమ్. ఈ సినిమాలో మహేష్ నటన తో పాటుగా నాజర్ నటన త్రిష నటన చాలా బాగా జనాలను ఆకట్టుకుంది అనే చెప్పాలి. 

 

అదే విధంగా సిబిఐ ఆఫీసర్ గా ప్రకాష్ రాజ్ నటన కూడా చాల బాగా నచ్చింది  జనాలకు అని చెప్పవచ్చు. ఈ సినిమాలో ఉన్న కథకు మంచి మార్కులు పడ్డాయి గాని సినిమా మాత్రం పెద్ద స్క్రీన్ మీద ఆడలేదు. ఇక టీవీ లో ఎప్పుడు వచ్చినా సరే ఈ సినిమాను కచ్చితంగా చూస్తూ ఉంటారు జనాలు అనేది వాస్తవం. ఈ సినిమాలో ఉండే మలుపులు జనాలకు ముందు అర్ధం కాలేదు గాని తర్వాత తర్వాత అర్ధమైంది అందుకే సినిమా వచ్చింది అంటే అసలు మిస్ అవకుండా చూస్తూ ఉంటారు. ఈ సినిమాలో ముఖ్యంగా ఫ్యామిలీ సన్నివేశాలు ఎక్కువగా ఉండటం కూడా కలిసి వచ్చిన అంశం. 

 

ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు ప్రయోగాలూ చేయడానికి ఏ మాత్రం ఆసక్తి చూపించలేదు అనే చెప్పాలి. ఆయన ఇప్పుడు రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అందులో సర్కారు వారి పాట సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి సిద్దంగా ఉంది. ఇటీవల మహేష్ లుక్ తో పాటుగా సినిమా టైటిల్ ని కూడా చిత్ర యూనిట్ ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: