వేదం... క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ఒక అందమైన సినిమా. జనాలకు పెద్దగా ఈ సినిమా కథ నచ్చలేదు గాని సినిమా మాత్రం చాలా బాగా నచ్చింది కొందరికి. అసలు ఈ సినిమాలో క్రిష్ చూపించిన కోణాలు ఆయన చూపించే కొన్ని కొన్ని  పాత్రలు సినిమాను మరో స్థాయికి తీసుకుని వెళ్ళాయి అనేది వాస్తవం. సినిమాలో ప్రతీ సీన్ కూడా ఒక రేంజ్ లో ఉంటుంది అని అంటారు. ఈ సినిమాలో  దర్శకుడు తీసుకున్న జాగ్రత్తల గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. ప్రతీ సీన్ ని అందంగా తీసుకుని రావడానికి గానూ ఆయన పడిన కష్టం అంతా ఇంతా కాదు అనే చెప్పాలి. 

 

ఇక అల్లు అర్జున్ నటన మంచు మనోజ్ నటన హీరోయింన్ దీక్ష సేథ్ నటన అన్నీ కూడా సినిమాలో హైలెట్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమా కథ విషయానికి వచ్చి చూస్తే సినిమా చాలా అందంగా ఉన్నా సరే దర్శకుడు సినిమా విషయంలో కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోలేదు అని అందుకే సినిమా ఫెయిల్ అయింది అంటారు. ఆ సమయంలో మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా సినిమాలు ఎక్కువగా రావడం తో ఈ సినిమాను జనాలు అంతగా ఆదరించలేదు అని చెప్తూ ఉంటారు. ఈ సినిమాలో అందమైన పాత్రలు ఉన్నా సరే సినిమాను చూపించే విధానం రాలేదు అంటారు 

 

కాని సినిమా టీవీ లో వస్తే మాత్రం కచ్చితంగా జనాలు చూస్తారు అనే సంగతి తెలిసిందే. దానికి కారణం సినిమా కథలో ఉన్న పట్టు అనేది అందరికి తెలిసిన విషయమే. కథలో బలం ఉండటం అలాగే పాత్రల  ను తీర్చి దిద్దిన విధానం వాటిని చూపించిన విధానం అన్నీ కూడా చాలా బాగా హైలెట్ అయ్యాయి అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: