ప్రస్తుతం టాలీవుడ్ లో కొత్త ట్రెండ్ నడుస్తుంది. సినిమా హాళ్లు మూసేయడం.. OTTలకు డిమాండ్ పెరగడంతో అక్కడ సత్తా చాటుతున్నారు యువ హీరోలు. ముఖ్యంగా సిల్వర్ స్క్రీన్ పై గుర్తింపు తెచ్చుకోలేని కొందరు నటులు ఓటిటి, వెబ్ సీరీస్ ల ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకుంటున్నారు. వీరిలో దశాబ్ధ కాలం క్రితం 'జై'తో హీరోగా పరిచయమైన నవదీప్ తో మొదలైతే ఈమధ్య సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ సత్తా చాటుతున్న సత్యదేవ్, కమెడియన్ ప్రియదర్శి వరకు ఉన్నారు.   

 

కథ నచ్చితే చాలు అది సినిమానా, వెబ్ సీరీసా లేదా ఓటిటి సినిమానా అన్నది వీళ్లకు అనవసరం. మీరెక్కడైనా రిలీజ్ చేసుకోండి మాకు మాత్రం రెమ్యునరేషన్ ఇస్తే చాలు అనేస్తున్నారు. ఈమధ్య యువ దర్శకులు కూడా కొత్త కొత్త కథలతో వెబ్ సీరీస్, వెబ్ మూవీస్ చేస్తున్నారు. ఈ కోవలో హీరోగా ఫ్లాపైన నవీన్ చంద్ర కూడా వస్తాడు. అతను కూడా ఒకటి రెండు వెబ్ మూవీస్ లో నటించాడు. మరో రెండు లైన్ లో ఉన్నట్టు కూడా తెలుస్తుంది.

 

థియేటర్లు ఎలాగు ఇప్పుడు ఓపెన్ చేసే అవకాశం కనిపించడం లేదు కాబట్టి మరి కొన్నాళ్లు వీళ్ల హవా కొనసాగించే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. ఒకప్పుడు ఛాన్సుల కోసం తిరిగిన యువ నటీనటులు ఇప్పుడు వారిలో సరైన టాలెంట్ ఉంది అంటే మాత్రం వెబ్ సీరీస్, వెబ్ మూవీస్ ఛాన్సులు తప్పకుండా వస్తున్నాయి. స్టార్స్ ఎలాగు వీటి మీద అంత ఇంట్రెస్ట్ చూపించరు కాబట్టి యువ హీరోలకు మంచి స్కోప్ దొరికినట్టే. మరి ఈ ట్రెండ్ ఎన్నాళ్లు కొనసాగుతుందో తెలియదు కాని ఇప్పుడు మాత్రం ఇలాంటి వెబ్ స్టార్స్ వరుస ఆఫర్లతో బిజీ బిజీగా ఉన్నారు.                

మరింత సమాచారం తెలుసుకోండి: