స్టార్ హీరోలకు సంబంధించిన కొన్ని సినిమాలు చిత్రీకరణ జరిగేటప్పుడు ప్రేక్షకుల్లో భారీ అంచనాలను కలుగజేస్తాయి. ఇలా భారీ అంచనాల మధ్య విడుదలైన సినిమాలు ఎక్కడో తేడా కొట్టి కాస్త యావరేజ్ టాక్ తో సరిపెట్టుకుంటాయి. వసూళ్ళ పరంగా బాగానే రాబట్టినప్పటికీ... స్టోరీ పరంగా  మాత్రం ఈ సినిమాలు అంతగా ప్రేక్షకులను ఆకట్టుకున్నట్లు  మాత్రం కనిపించవు. అయితే వెండితెరపై ఇలా డీలా పడిపోయిన సినిమాల్లో  బుల్లితెరపై మాత్రం ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తాయి. ఇలా వెండితెరపై డీలా పడిపోయి బుల్లితెరపై ప్రేక్షకులను ఎంతగానో అలరించిన సినిమా ఎవడు. 

 


 రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ఎవడు సినిమాలో అల్లు అర్జున్ కూడా ఒక కీలక పాత్ర పోషించడం ఈ సినిమాపై ఎంతో అంచనాలను పెంచింది. ఇక భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. అయితే ఎందుకో  ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో భారీ అంచనాల మధ్య విడుదలైనప్పటికీ యావరేజ్ టాక్ తో  సర్ది పెట్టుకుంది ఈ సినిమా. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ లు కలిసి నటించిన  కూడా ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయితే ఈ సినిమా వెండితెర ప్రేక్షకులను మెప్పించ లేకపోయినప్పటికీ బుల్లితెర ప్రేక్షకులను మాత్రం ఎంతగానో ఆకట్టుకుంది అనే చెప్పాలి. 

 


 బుల్లితెరపై ఎక్కువ సార్లు వచ్చిన సినిమాగా  కూడా రికార్డు సృష్టించింది ఎవడు  సినిమా. ఈ సినిమా వస్తుందంటే బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా సినిమాను తిలకిస్తుంటారు. ఇక ఈ సినిమా చూస్తున్నంత సేపు ఏం జరుగుతుంది అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. అంతేకాకుండా కుటుంబంతో హాయిగా ఈ సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు బుల్లితెర ప్రేక్షకులు. ఇలా ఈ సినిమా బుల్లితెర ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకున్నది అనే  చెప్పాలి.  రామ్ చరణ్ అల్లు అర్జున్ కలిసి నటించడంతో సినిమా ఎన్నిసార్లు టెలివిజన్లో వచ్చినప్పటికీ ప్రేక్షకులందరూ ఈ సినిమా చూడడానికి ఎంతో ఆసక్తి చూపుతుంటారు. ఇలా వెండితెరపై యావరేజ్ టాక్  తెచ్చుకున్నప్పటికీ బుల్లితెరపై మాత్రం సూపర్ హిట్ అయ్యింది ఈ  సినిమా.

మరింత సమాచారం తెలుసుకోండి: