బాలీవుడ్ స్టార్ హీరో, ఎంఎస్ ధోని ఫేమ్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నారు. ముంబై బాంద్రాలోని తన ఫ్లాట్‌లో ఆయన ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఏం జరిగిందనే విషయంపై పోలీసులు ఆరాతీస్తున్నారు.  ఎవరూ ఊహించని విధంగా ఎంతో భవిష్యత్ ఉన్న సుశాంత్ ఇలా ఆత్మహత్య చేసుకోవడం బాలీవుడ్ ని కలచి వేసింది. పోస్ట్ మార్టం తరువాత ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారనే విషయం వెలుగులోకి వస్తున్నాయి. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాాడని పోస్ట్ మార్టం రిపోర్ట్ విడుదల చేశారు. అయితే సుశాంత్ బాలీవుడ్ లో ఉన్న బంధు ప్రీతి కారణంగానే చనిపోయాడని.. అతను డిప్రేషన్ లోకి వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు కొంత మంది సహనటులు.

IHG

తాజాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో కొత్తకొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.  తాజాగా ఓ జాతీయ మీడియా ఛానల్ సమాచారం ప్రకారం... సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడిన మూడు రోజుల ముందు తన సిబ్బంది అందరికీ జీతాలు చెల్లించారట.. అంతే కాదు లాక్ డౌన్ సమయంలో గతంలో చెల్లించిన దాని కంటే.. ఎక్కువగా చెల్లించినట్లు సమాచారం.  అయితే ఇక ముందు తాను జీతం ఇవ్వలేనని.. సున్నితంగా వారికి చెప్పినట్లు సమాచారం. దీనికి కారణం అతను తన సిబ్బందికి సాలరీస్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారా.. లేదా ఆత్మహత్య చేసుకోబుతున్నానని  ఉద్దేశంతోనే సిబ్బందితో ఈ వ్యాఖ్యలు చేశాడా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

IHG

కాగా, సుశాంత్ కొంత కాలంగా తీవ్రమైన డిప్రేషన్ లో ఉన్నారని.. అతని ప్రవర్తనలో నిరుత్సాహం.. ఆవేదన కనిపించినట్లు అతన్ని చూసిన సన్నిహితుల ద్వార తెలిసిందని అంటున్నారు.  తీవ్ర మానసిక ఒత్తిడితో బాధపడుతున్నాడని, ఆ మనోవేదనతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు. అయితే.. సుశాంత్ మానసిక ఒత్తిడికి కారణం ఏమై ఉంటుందనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే సుశాంత్ ఆత్మహత్య కేసులో 13 మంది స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: