ఇటీవల బాలీవుడ్ ఇండస్ట్రీలో బాక్సాఫీస్ దగ్గర రికార్డులు సృష్టిస్తున్నాయి సౌత్ ఇండస్ట్రీ కి చెందిన సినిమాలు. అలాగే చాలా వరకూ టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు ఫ్లాప్ అయిపోయి దుకాణం సర్దేస్తున్న చాలామంది హీరోలు సౌత్ ఇండస్ట్రీ సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీ లో రీమేక్ చేస్తూ విజయాలు సాధిస్తున్నారు. అప్పట్లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ విధంగానే టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ డూపర్ హిట్ అయిన 'పోకిరి' సినిమాని 'వాంటెడ్' సినిమాగా తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నారు.

IHG

అప్పటిదాకా సల్మాన్ కెరియర్ చాలా వరకు చేస్తున్న సినిమాలు ఫ్లాప్ అయిపోయి ఇంక ఇండస్ట్రీ నుండి వెళ్ళి పోతాడు అని అందరూ అనుకున్న పరిస్థితి. కానీ 'వాంటెడ్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని ఇండస్ట్రీలో స్థిరపడి తన ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఇటీవల 'అర్జున్ రెడ్డి' సినిమాని బాలీవుడ్ ఇండస్ట్రీ లో 'కబీర్ సింగ్' గా తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్న షాహీద్ కపూర్ ఆ తర్వాత వెంటనే సౌత్లో 'జెర్సీ' సినిమా రీమేక్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

IHG's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=JERSEY' target='_blank' title='jersey-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>jersey</a> <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=REMAKE' target='_blank' title='remake-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>remake</a> to begin shoot from Dec 2 in ...

ఇదిలా ఉండగా ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకముందే మరో సౌత్ సినిమాపై షాహిద్ కపూర్ మనసు పారేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమిళంలో సూర్య హీరోగా తెరకెక్కి తెలుగులో 'ఆకాశమే నీ హద్దురా' టైటిల్ తో విడుదల కావాల్సిన చిత్రాన్ని షాహిద్ రీమేక్ చేస్తున్నాడంటున్నారు.  ఈ రీమేక్ కు సంబందించిన పూర్తివివరాలు తెలియాల్సి వుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: