టాలీవుడ్ లో మహానటి సినిమా ఒక సంచలనం. టాలీవుడ్ అనే కాదు తమిళం లో కూడా ఈ సినిమా ఒక సంచలనం అనే విషయం తెలిసిందే. ఈ సినిమాకు ముందు కీర్తి సురేష్సినిమా తర్వాత  కీర్తి సురేష్ అనే విషయంగా ఉంటుంది. ఈ సినిమాలో ఆమె నటన ఆమె చేసిన కొన్ని సీన్ లు ఇంకా జనాల కళ్ళ ముందు అదే విధంగా ఉన్నాయి అని చెప్పాలి. ముఖ్యంగా ఆమె దుల్కర్ సల్మాన్ పక్కన చేసిన కొన్ని కొన్ని సీన్ లు అయితే జనాలకు ఇంకా గుర్తున్నాయి అనే చెప్పాలి. ప్రతీ సీన్ లో కూడా ఆమె చాలా అందంగా జీవించింది అనే విషయం టాలీవుడ్ మొత్తం చెప్తుంది. 

 

ఇక వారిద్దరి మధ్య ప్రేమ గురించి చెప్పుకునే సన్నివేశాలు చాలా బాగా నచ్చాయి మన  జనాలకు అని చెప్పాలి శివాజీ పాత్రలో ఉన్న దుల్కర్ సల్మాన్ ఆమె అంటే ఇష్టం అని అదే విధంగా తనకు పెళ్లి అయినా సరే పెళ్లి మీద నమ్మకం లేదు ప్రేమ మీద మాత్రమే నమ్మక౦ ఉంది అని ఆమెను ఒప్పించిన విధానం అన్నీ కూడా జనాలకు బాగా నచ్చాయి అని చెప్పాలి. ఇక ఆయన నటన చూసిన వాళ్ళు అయితే శివాజీ ఆయనలో ప్రవేశించాడు అంటూ కామెంట్స్ చేసారు. ఇక సినిమాలో వాళ్ళు పెళ్లి చేసుకున్న విధానం కూడా చాలా బాగా నచ్చింది జనాలకు అని చెప్పాలి. 

 

ప్రతీ సీన్ లో కూడా ఇద్దరు చాలా బాగా నటించారు. ప్రేమను కూడా చాలా అందంగా చెప్పుకున్నారు అనే చెప్పాలి. అసలు సావిత్రి జీవితం లో కూడా అంత అందంగా జరిగిందా లేదా అనేది ఎవరికి తెలియదు గాని స్క్రీన్ మీద మాత్రం అంత అందంగా చూపించాడు దర్శకుడు నాగ్ అశ్విన్.

మరింత సమాచారం తెలుసుకోండి: