మన తెలుగులో కొన్ని కొన్ని సినిమాలు జనాలకు ఎన్ని రోజులు అయినా సరే అలా గుర్తు ఉంటూ ఉంటాయి. సినిమా ఫ్లాప్ అయినా హిట్ అయినా సరే జనాలు మాత్రం వాటిని ఏ మాత్రం కూడా మర్చిపోయే అవకాశం అనేది ఉండదు అనే చెప్పాలి. కొందరు హీరోల సినిమాలు అయితే జనాలకు గుర్తు ఉంటాయి. ఇక అందులో నరసింహ సినిమా ఒకటి. ఈ సినిమాను టాలీవుడ్ లో అయినా తమిళం లో అయినా సరే మర్చిపోయే అవకాశం లేదు అనే చెప్పాలి. ఈ సినిమాలో ఉన్న ప్రతీ సీన్ కూడా జనాలకు ఇంకా గుర్తు ఉంది. రజని నటన నుంచి రమ్యకృష్ణ నటన వరకు అన్నీ కూడా సంచలనం అనే చెప్పాలి. 

 

ప్రధానంగా రజని కాంత్ నటన చూసిన జనాలు అయితే ఈ సినిమా తర్వాత ఆయనను ఏకంగా ఇండియన్ సూపర్ స్టార్ ని చేసారు అనేది వాస్తవం. ఆ విధంగా రజని పాపులర్ అయ్యారు ఈ సినిమాతో. ఇక రమ్య కృష్ణ అయితే ఈ సినిమా తర్వాత ఒక వెలుగు వెలిగింది అనే చెప్పాలి. ఆమె చాలా అందంగా నటించారు ఈ సినిమాలో అనే విషయం అందరికి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో సౌందర్య ను రజని కాంత్ ప్రేమించే విషయం ఆమెకు చెప్పే విషయం అన్నీ కూడా జనాలకు ఇంకా గుర్తున్నాయి అనే చెప్పాలి. 

 

ఆమెకు ప్రేమను చెప్పడానికి ఒక లెటర్ రాయడం ఆ లెటర్ ఇవ్వడానికి రజని ఇబ్బంది పడటం  ఇక చివరికి నిశ్చితార్ధం కోసం వెళ్ళిన సమయంలో రమ్యకృష్ణ ను కాకుండా ఆమెను ప్రేమిస్తున్నా అని చెప్పి తీసుకుని రావడం అన్నీ కూడా చాలా బాగా నచ్చాయి జనాలకు అనే చెప్పాలి. ఇలాంటి సీన్ లు అప్పటి వరకు సినిమాల్లో రాలేదు అన్నారు జనాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: