సాధార‌ణంగా కొన్ని సినిమాల్లో ప్రేమ క‌థ‌లు ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ర్షిస్తాయి. ఎంత‌లా అంటే.. ఎప్ప‌టికీ ఆ సినిమాను మ‌ర్చిపోలేనంత‌. అలాంటి వాటిలో `100% లవ్‌` చిత్రం కూడా ఒక‌టి. అక్కినేని మూడో త‌రం నాగ చైతన్య హీరోగా క్రియేటివ్ డైరెక్ట‌ర్  సుకుమార్‌ తెరకెక్కించిన రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ 100% లవ్. ఈ సినిమాలో నాగ చైత‌న్య స‌ర‌స‌న మిల్కీ బ్యూటీ తమన్నా న‌టించింది.  2011 మే 6న విడుదలైన ఈ చిత్రం సూప‌ర్ స‌క్సెస్ అయింది.

IHG

బాలు మహేంద్రగా చైతూ, మహాలక్ష్మిగా తమన్నా నటన మాట‌ల్లో చెప్ప‌లేనిది. బాగా చదివే బాలు, చదువంటే ఇష్టంలేని మహాలక్ష్మి ప్రేక్షకుల్ని ఓ రేంజ్‌లో ఆకట్టుకున్నారు. ప్రేమ కథల్ని సరికొత్తగా చూపడంలో సుకుమార్‌ స్టైలే వేరని ఈ సినిమాతో మ‌రోసారి నిరూపించుకున్నాడు. ఫ‌స్టాఫ్‌లో చైతూ - తమన్నా మ‌ధ్య  బావా మరదళ్ల సరసాలు, కాలేజీ స్టూడెంట్స్ గా చ‌దువుల్లో పోటా పోటి ఆక‌ర్షించ‌గా..  సెకండాఫ్ లో ఫ్యామిలీ ఎమోషన్స్ ను యాడ్ చేసి ప్రేమ, పెళ్లికి ఉన్న ఇంపార్టెన్స్ ను సమపాళ్లలో చూపించాడు ద‌ర్శ‌కుడు.

IHG

ఇక అప్పట్లో ఈ సినిమా ప్రేమికుల మదిలో ఓ గూడు కట్టుకుంది. బావ మరదళ్లకు ప్రత్యేకంగా నిలిచింది. మ‌రియు నాగ చైత‌న్య అమాయ‌క‌పు న‌ట‌న‌, త‌మ‌న్నా గ్లామ‌ర్ సినీ ప్రేక్ష‌కుల‌కి ఎంత‌గానో వినోదాన్ని పంచింది. అయితే వాస్త‌వానికి అప్పటివరకు స్లోగా ఉన్న నాగ చైతన్య కెరీర్ కు బూస్ట్ ఇచ్చిన ల‌వ్ స్టోరి ఇది. ఆ సినిమా తర్వాత చైతు తన మార్కెట్ ని కొద్దీ కొద్దిగా పెంచుకుంటూ వచ్చాడు. అలాగే అపజయాలతో ఉన్న దర్శకుడు సుకుమార్ కూడా అదే సినిమాతో రికవర్ అయ్యాడు. 

IHG

ఇక అటు తెలుగులో తమన్నాకు మంచి పేరు, హిట్టు తీసుకొచ్చిన సినిమాల్లో ఇది కూడా ఒక‌టి. మ‌రోవైపు  ఈ చిత్రానికి మరో ప్రధాన బలం సంగీతం. దేవీశ్రీ ప్రసాద్‌ స్వరపరిచిన అన్ని పాటలు ఓ ఊపు ఊపాయి.  కళ్ళు కళ్ళు ప్లస్సు.., అహో బాలూ.. , ఏ స్క్వేర్ బీ స్క్వేర్.. ,దట్ ఈజ్ మహాలక్ష్మి.., దూరం దూరం.., డియ్యాలో డీయ్యాలో.., బంధమెక్కడో.. ఇలా ప్ర‌తి సాంగ్ మంచిగా హిట్ అయ్యాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: