ఒకప్పుడు తమిళనాట సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే.. ఓ పెద్ద పండుగ వాతావరణం ఉండేది. లింగ సినిమా తర్వాత ఈ ట్రండ్ కాస్త మారింది. అప్పట్లో రజినీకాంత్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే డిస్ట్రిబ్యూటర్స్, బయర్స్ ఎగబడి కొనుకునే వారు.  కొన్నేళ్ల నుండి రజినీకి ఎందుకో కలిసి రావడం లేదు. తమిళంలో కూడా రజినీ సినిమాలని ఆదరించలేకపోతున్నారు అక్కడి జనాలు.  లింగా సినిమా తర్వాత కబాలి, కాలా భారీ డిజాస్టర్స్ అయ్యాయి. మద్యలో శంకర్ దర్శకత్వంలో వచ్చిన రోబో 2.0 కాస్త పరవాలేదు అనిపించింది. ఇక కార్తీ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘పేట’ కూడా మంచి హిట్ అయ్యింది.  ఇటీవల మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ‘దర్బార్’ హిట్ టాక్ వచ్చినా.. ఆర్థికంగా నష్టపోయిందని అంటున్నారు. అయితే రజినీకాంత్ ఈ మద్య ఫ్లాప్ దర్శకులకు కూడా మంచి చాన్సులు ఇస్తున్నారని అంటున్నారు.

 

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తో సినిమా చేయాలనేది ప్రతి దర్శకుడికీ లక్ష్యంగా వుంటుంది.అయితే, ఆయన ఇమేజ్ కు తగ్గా కథను తయారుచేసుకుని, ఆయనని ఒప్పించడం అంటే మాటలు కాదు. ఇప్పటికే ఎన్నోరకాల పాత్రలు చేసేసిన రజనీని కొత్త తరహా పాత్రలో చూపించడం కూడా ఆషామాషీ కాదు.  ఆ మద్య సంక్రాంతికి కార్తీ సుబ్బరాజు డైరెక్షన్ లో 'పెట్టా' అనే మూవీ బాగా అలరించింది. ఇందులో రజినీ ఎన్నడూ లేని విధంగా చాలా యంగ్ గా.. కొత్త లుక్ తో మనల్ని ఎంటర్టైన్ చేశారు. తాజాగా మరోసారి ఈ కాంబినేషన్ లో కొత్త మూవీ రాబోతుందని కోలీవుడ్ ఫిలిమ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది

 

. 'పేట' సినిమా తమిళ నాటే కాకుండా, తెలుగునాట కూడా మంచి హిట్టయింది. ఈ క్రమంలో తాజాగా కార్తీక్ మరో కథను రజనీకి వినిపించాడట. ఇది కూడా కొత్త తరహాగా ఉండడంతో రజనీ వెంటనే ఓకే చెప్పేశాడని అంటున్నారు. ప్రస్తుతం తాను శివ దర్శకత్వంలో చేస్తున్న 'అన్నాత్తే' మూవీ తర్వాత కార్తీక్ సుబ్బరాజు మూవీ ఆయన చేస్తారని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: