సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు లాక్ డౌన్ తర్వాత సినిమా షూటింగ్ విషయంలో కమర్షియల్ గా కాకుండా మానవత్వంతో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం నిర్మిస్తున్న సినిమాలు  షూటింగ్ మధ్యలో ఆగిపోయిన..ప్రభుత్వాల నుండి అనుమతులు వచ్చిన సిబ్బందికి ఎవరికీ కరోనా సోకకుండా షూటింగ్ చాలా నెలలపాటు జరపకూడదు అని డిసైడ్ అయ్యారట. గుణశేఖర్ దర్శకత్వంలో తన కొడుకు రానా నీ హీరోగా పెట్టి భారీ ప్రాజెక్టు చిత్రం హిరణ కశిప ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుని సినిమా షూటింగ్ కి రెడీ గా ఉన్న తరుణంలో ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ కి ఎక్కడి పనులు అక్కడే నిలిపేయాలని సురేష్ బాబు డిసైడ్ అయ్యారట. 120 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించడానికి సురేష్ బాబు ప్లాన్ చేశారట.

IHG

కానీ ప్రస్తుత పరిస్థితులు వల్ల ప్లన్స్ మొత్తం తారుమారు కావడంతో 'హిరణ కశిప' మూవీ బడ్జెట్ తగ్గించాలని గుణశేఖర్ కి సురేష్ బాబు సూచించినట్లు ఫిలిం నగర్ టాక్. ప్రస్తుతం దేశంలో ఉన్న కరోనా ఎఫెక్ట్ 2022 వరకు ఉండే అవకాశం ఉండటంతో అప్పుడు థియేటర్ సాధారణస్థితికి వచ్చే అవకాశం ఉందని అప్పటివరకు సినిమా గురించి మాట్లాడవద్దని గుణశేఖర్ కి సురేష్ బాబు చెప్పినట్లు వార్తలు అందుతున్నాయి.

IHG

అంతేకాకుండా ఇప్పటికే ఈ సినిమాకి దాదాపు పది కోట్లు ఖర్చు చేసినట్లు… ఈ కరోనా దెబ్బ కీ లాక్ డౌన్ విధించడంతో ఆ 10 కోట్లు సురేష్ బాబు నష్టపోయినట్లు సమాచారం. అంతేకాకుండా ప్రస్తుతం తన ప్రొడక్షన్ బ్యానర్ లో వస్తున్న  రానా విరాట పర్వం, నారప్ప రెండు సినిమాలు కూడా ఇప్పుడు అప్పుడే రిలీజ్ చేయకూడదని సురేష్ బాబు అనుకుంటున్నట్లు ఫిలిం నగర్ టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: