తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది నాటి తరం సినీ ప్రముఖుల వారసులు ప్రస్తుతం నేటి తరం ప్రేక్షకులను అలరిస్తూ ఎంతగానో ఆకట్టుకుంటు ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇలా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న సినీ ప్రముఖుల వారసులు ఎంతమంది ఉన్నారు. ముక్యంగా  అక్కినేని ఫ్యామిలీ నుంచి  ముగ్గురు హీరోలు ఉన్న విషయం తెలిసిందే. అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా నాగార్జున తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై గుర్తింపు సంపాదించారు. టాలీవుడ్ మన్మథుడు గా మారిపోయిన నాగార్జున ఇప్పటికికూడా అమ్మాయిల రాకుమారుడిగా కొనసాగుతున్నారు. 

 


 ఇక నాగార్జున వారసులుగా తెలుగు చిత్ర పరిశ్రమకు నాగచైతన్య అఖిల్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ఇద్దరు యువ హీరోలు తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి క్రేజ్ ను సంపాదించుకుని  దూసుకుపోతున్నారు. ఓవైపు నాగచైతన్య వరుస సినిమాలతో  దూసుకుపోతూ హీరోగా మంచి ఇమేజ్ సంపాదించుకున్నారు. అమల అక్కినేని నాగార్జున ల  ముద్దుల కొడుకైనా అక్కినేని అఖిల్ తెలుగు చిత్ర పరిశ్రమకు అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే నాగచైతన్య కంటే అఖిల్ కు గ్రాండ్ ఎంట్రీ లభించింది అనే చెప్పాలి. 

 


 అయితే అక్కినేని అఖిల్ కు అక్కినేని అభిమానుల్లో  ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఎందుకంటే నాగార్జున మన్మధుడు గా క్రేజ్ సంపాదించి తెలుగు చిత్ర పరిశ్రమలో ఆకట్టుకున్నారు. అక్కినేని అఖిల్ కూడా అదే విధంగా తన ఫిట్నెస్ తో  తన అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తున్నాడు. చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ కూడా అందంతో ఎంతోమంది మగువల మనసును దోచాడు అక్కినేని అఖిల్. ఒక రకంగా చెప్పాలంటే నేటి తరంలో తండ్రి ని  మంచి యూత్ ని ఆకర్షించాడు అనే చెప్పాలి. యూత్ లో అఖిల్ కి మంచి పేరు ఉంటుంది ముఖ్యంగా అమ్మాయిల్లో అయితే మరింత ఎక్కువగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: