ఇంటి దగ్గరే ఉండే ఆడవాళ్లకు సీరియల్స్ అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కాగా ఇటీవల కరోనా లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అన్ని సినిమా షూటింగ్ లతో పాటు సీరియల్ షూటింగ్ ఆగిపోవటంతో సస్పెన్స్ తో ఆగిపోయిన సీరియల్స్ ఇండియన్ లేడీస్ సీరియల్స్ ఫ్యాన్స్ ని సస్పెన్స్ లో పడేశాయి. ఉత్కంఠ ని తట్టుకోలేక చాలామంది ఇండియన్ లేడీస్ సీరియల్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సినిమా షూటింగ్ లకు అనుమతులు ఇవ్వక పోయినా పెద్ద ప్రాబ్లం ఉండదు సీరియల్ షూటింగ్ లకు అనుమతులు ఇవ్వండి సస్పెన్స్ భరించలేక పోతున్నాం అంటూ తెగ గగ్గోలు పెట్టారు.

 

మరో పక్క టెలివిజన్ లో... సీరియల్ షూటింగ్ ఆగిపోవడం తో వేసిన సీరియల్ ఎపిసోడ్లను రిపీట్ చేస్తూ వస్తున్నారు. ఇటువంటి తరుణంలో నాలుగో దశ లాక్ డౌన్ టైమ్ లో కేంద్ర ప్రభుత్వం సినిమా షూటింగ్ లతో పాటు సీరియల్స్ షూటింగ్ లకు కూడా అనుమతులు ఇవ్వటంతో కొండంత ఆశలు పెట్టుకున్న ఇండియన్ సీరియల్స్ లేడీస్ ఫ్యాన్స్ కి ప్రాణం లేచి వచ్చినట్లయింది. దీంతో ఇటీవల చాలా చోట్ల సీరియల్స్ షూటింగ్స్ స్టార్ట్ అవడంతో అందరూ హ్యాపీ గా ఫీల్ అయ్యారు. కానీ ఇంతలోనే ఇటీవల పాజిటివ్ కేసులు ఉన్న కొద్దీ ఎక్కువ అవటంతో సీరియల్స్ షూటింగ్ స్టార్ట్ అయిన తమిళనాడు మరియు తెలుగు రాష్ట్రాలలో లో షూటింగ్ లకు మళ్లీ బ్రేక్ పడినట్లు సమాచారం.

 

ముఖ్యంగా తమిళనాడులో కేసుల సంఖ్య ఉన్న కొద్దీ పెరిగిపోవడంతో ఈనెల 19 నుండి షూటింగు ఎక్కువ జరిగే ప్రాంతం చెన్నై మొత్తం లాక్డౌన్ లోకి వెళ్లిపోవడంతో సీరియల్స్ అభిమానులు ఆనందం మూడునాళ్ళ ముచ్చట అయింది. మరోవైపు సినిమా షూటింగ్ ల విషయంలో చిన్న సినిమాల నిర్మాతలు షూటింగులు చేస్తున్నా… పెద్ద సినిమాలు మాత్రం ఇంకా ప్రారంభం కాలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: