ఆర్ ఎక్స్ 100 సినిమాతో ఓవర్ నైట్ స్టార్ స్టేటస్ ని సంపాదించుకుంది పాయల్ రాజ్ పుత్. ఈ సినిమా తర్వాత పాయల్ టాలీవుడ్ లో వీర లెవల్లో సత్తా చాటుతుందనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే అమ్మడు గాలి కూడా బాగా వీచింది. అయితే కెరీర్ ప్రారంభంలోనే వరసగా తప్పులు మీద తప్పులు చేసింది. ఆర్ ఎక్స్ 100 సినిమా తర్వాత కూడా దాదాపు 10-15 స్క్రిప్టులు అలాంటివే వచ్చాయని అప్పుడే వెల్లడించింది. అదీకాక వచ్చిన ప్రతీ ఒక్కరు కథేంటో చెప్పకుండా..ఇన్ని లిప్ లాక్స్ ఉంటాయి..ఇన్ని రొమాంటిక్ సీన్స్ ఉంటాయి..మీరు ఇలా యాక్ట్ చేయాలి ..ఇలాంటి కాస్ట్యూంస్ వేసుకోవాలి అంటూ నస పెట్టారట. దాంతో ఆ సినిమాలన్నిటిని రిజక్ట్ చేసిందట. ఈ విషయం తనే స్వయంగా వెల్లడించింది కూడా.

 

అయితే అదే మాట మీద ఉండకుండా మళ్ళీ ఎక్కడ ఛాన్సులు రావని భయపడిందా లేక ఎవరైనా పాయల్ ని మోటివేట్ చేశారా తెలీదు గాని ఆర్ డి ఎక్స్ లవ్ సినిమాని ఒప్పుకుంది. ఈ సినిమా పోస్టర్స్..టీజర్..ట్రైలర్ రిలీజయ్యాక చూస్తే పాయల్ చెప్పిన దానికి చేసిన దానికి అసలు పొంతనే కుదరలేదు. నిర్మాతలు అడిన మాటలకి అన్ని సినిమాలు వదులుకున్న పాయల్ ఆర్ డి ఎక్స్ లవ్ ఎలా ఒప్పుకుందో అర్థం కాలేదు. ఇక అదే సమయంలో ఐటం సాంగ్ కమిటయ్యి కూడా పొరపాటు చేసిందని మాట్లాడుకున్నారు.

 

కాని లక్కీగా విక్టరీ వెంకటేష్ నాగ చైతన్య నటించిన మల్టిస్టారర్ వెంకీ మామ లో ఛాన్స్ అందుకుంది. అది కూడా వెంకీ సరసన. సీనియర్ హీరో అయిన పెద్ద స్టార్ కాబట్టి పాయల్ కి ఈ సినిమా కలిసి వస్తుందనుకుంది. సినిమా హిట్ అయినా పాయల్ తేలిపోయింది. కాస్తో కూస్తో క్రెడిట్ రాశీకన్నాకి పోయింది కాని పాయల్ కి దక్కలేదు. అయినా డిస్కోరాజా లో రవితేజ సినిమాలో నటించింది. మాస్ మహారాజ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దాంతో అసలు పాయల్ గురించి మాట్లాడుకున్న వాళ్ళే లేకుండా పోయారు.

 

అయితే ఖచ్చితంగా పాయల్ హీరోయిన్ మెటీరియల్. అందం అభినయం మెండుగా ఉన్నాయి. పాత్ర డిమాండ్ చేస్తే ఎంత బోల్డ్ గా అయినా నటిస్తుంది. చెప్పాలంటే పాయల్ కి తక్కువేం లేదు. కాని ఎందుకనో ఐటం సాంగ్స్ కి అడుగుతున్నారు. ఇది దారుణం అన్న టాక్ వినిపిస్తుంది. రవితేజ రమేష్ వర్మ సినిమాలో కమిటయ్యాడు. కోనేరు సత్యనారాయణ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాలో ఐటం సాంగ్ కోసం పాయల్ ని సంప్రదించారట. మరి ఒప్పుకుంటుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: