కరోనాతో ఓటీటీ ప్లాట్ ఫామ్ అంటే ఏంటో చాలామందికి తెలిసింది. సినిమాలకు ఇదే దిక్కంటూ కథనాలు కూడా వచ్చాయి. అయితే.. పెద్ద సినిమాలు మాత్రం ఓటీటీని పట్టించుకోవడం లేదు. థియేటర్స్ లోకి మాత్రమే వస్తామంటున్నారు. అయితే ఓ స్టార్ హీరో మూవీ మాత్రం.. ఓటీటీలోకి రావడానికి రెడీ అవుతున్నాడు. ఆగస్ట్ 15న వస్తున్న ఆ హీరో ఎవరో కాదు అక్షయ్ కుమార్. 

 

థియేటర్స్ ఇప్పట్లో ఓపెన్ కావని తేలిపోయింది. ఒకవేళ తెరుచుకున్నా.. థియేటర్స్ లోకి జనాలు వస్తారన్న నమ్మకం అయితే లేదు. దీంతో చిన్న సినిమా నిర్మాతలు ఓటీటీని ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే హిందీ, తమిళం.. ఒకటేంటి అన్ని భాషల్లో చిన్న సినిమాలు కొన్ని ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. భారీ బడ్జెట్ మూవీస్.. స్టార్స్ మాత్రం ఇంతవరకు అడుగుపెట్టలేదు. 

 

ఓటీటీలోకి అడుగుపెడుతున్న స్టార్ హీరోగా అక్షయ్ కుమార్ నిలుస్తున్నాడు. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా.. అక్షయ్ కుమార్ సినిమాలు థియేటర్స్ లో మినిమం 100కోట్లు కలెక్ట్ చేస్తాయి. బలమైన మార్కెట్.. బిజినెస్ ఉన్న అక్షయ్ కూడా ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. లారెన్స్ దర్శకత్వంలో అక్షయ్ నటించిన లక్ష్మీబాంబ్ ఆగస్ట్ 15న ఓటీటీలో రిలీజ్ అవుతోంది. తెలుగు, తమిళంలో హిట్ అయిన కాంచనాకు రీమేక్ గా లక్ష్మీబాంబ్ రూపొందింది. 

 

కాంచన రీమేక్ లక్ష్మీబాంబ్ పై లారెన్స్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. తనకు సక్సెస్ తీసుకొచ్చిన హారర్ కామెడీ జానర్ నమ్ముకుంటూ.. హిందీలోకి అడుగుపెట్టాడు. మొదట్లో నిర్మాతతో వచ్చిన మనస్పర్థల కారణంగా ప్రాజెక్ట్ నుంచి తప్పుకోగా.. అక్షయ్ జోక్యం చేసుకొని.. లారెన్స్ కు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాడు. కరోనా పరిస్థితుల్లో లక్ష్మీబాంబ్ థియేటర్స్ దగ్గర పేలే అవకాశం లేకపోవడంతో.. డిజిటల్ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇలా ఓటీటీలో వస్తున్న బాలీవుడ్ తొలి స్టార్ మూవీ ఇదే. 

మరింత సమాచారం తెలుసుకోండి: