టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన చాలా తక్కువ కాలానికే స్టార్ హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకున్నారు లయ. ఆమెకు చాలా మంచి పేరు వచ్చింది.  నటన విషయంలో ఎక్కడా కూడా చికాకుగా నటించాకపోవడం అంతే కాదు ఏ పాత్రలో అయినా సరే హుందాగా నటించడం వంటివి ఆమె సొంతం. ఏ హీరో తో సినిమా చేసినా సరే ఆమె మార్క్ అనేది సినిమాలో కచ్చితంగా ఉంటుంది. ఇక తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు ఆమె. ఇది పక్కన పెడితే ఆమె సినిమాల్లో ఆమె చేసిన పాత్రలు ఆమె స్కిన్ షో చేయకపోవడం తో ఎక్కువగా హిట్ అవ్వలేదు అని అంటారు. 

 

స్కిన్ షో చేసి ఉంటే ఆమెకు మంచి పేరు వచ్చేది అని చాలా మంది ఇప్పటికి కూడా అంటూ ఉంటారు. కాని ఆమె స్కిన్ షో విషయంలో అంతగా ఫోకస్ చేయలేదు. నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలే ఆమె ఎక్కువగా చేసారు. ఇక గుడ్డి అమ్మాయి గా కూడా ఆమె నటించి మెప్పించారు అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉంటే ఆమె శ్రీ గణేష్ అనే ఒక డాక్టర్ ని వివాహం చేసుకున్నారు. ఇప్పుడు వారికి ఇద్దరు సంతానం. ఇప్పుడు ఆమె అమెరికాలో సెటిల్ అయ్యారు. అక్కడే ఆమె ఉంటూ భర్త వ్యవహారాలను చూసుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

 

ఇక ఆమె పెళ్లి తర్వాత సినిమాల్లో అవకాశాలు వచ్చినా సరే ఆమె చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు అనే చెప్పాలి. మరి దానికి కారణం ఏంటీ అనేది ఎవరికి తెలియదు గాని ఆమె మాత్రం పెళ్లి తర్వాత అసలు సినిమాల్లో ఎన్ని అవకాశాలు వస్తున్నా సరే వాటికి దూరంగానే ఉన్నారు గాని చేయలేదు. ఇక ఇప్పుడు ఆమె ఇండియా రావడమే మానేసింది అని అంటారు కొందరు.

మరింత సమాచారం తెలుసుకోండి: