తమిళనాడు మొత్తం దాదాపుగా కరోనా గుప్పిట్లో ఉన్న సంగతి తెలిసిందే. కరోనా కేసులు రోజు రోజుకి అక్కడ పెరుగుతూ పోతున్నాయి. ఇప్పటికే 60 వేల కేసులకు పైగా నమోదు అయ్యాయి. రాజధాని చెన్నై అయితే పూర్తిగా కరోనా గుప్పిట్లోనే ఉంది అనే విషయం స్పష్టంగా చెప్పవచ్చు. రాష్ట్ర సర్కార్ కూడా కరోనా నుంచి బయటకు రావడానికి పాపం తీవ్రంగా అప్రయత్నాలు చేస్తుంది. ఇది పక్కన పెడితే ఇప్పుడు అక్కడ కరోనా కేసులు మరోసారి సినీ ప్రపంచాన్ని షాక్ కి గురి చేసాయి. ఏమీ లేదు. అక్కడ కరోనా కేసులు భారీగా నమోదు కావడంతో తమిళనాడు సర్కార్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. 

 

షూటింగ్ లను కొన్ని ప్రాంతాల్లో చేయవద్దు అని సినీ పరిశ్రమకు స్పష్టం చేయడం తో ఇప్పుడు సినిమా షూటింగ్ లను ఆపేశారు. వాస్తవానికి షూటింగ్ స్పాట్ లు చాలా కీలకమైన వాటిలోనే అక్కడి సర్కార్ ఆంక్షలు విధించింది. అసలే కరోనా దెబ్బకు నటులు ఎవరూ షూటింగ్ కి రాకుండా ఉంటున్న తరుణంలో ఈ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. సినిమాలు అన్నీ కూడా ఇప్పుడు దాదాపుగా వాయిదా పడ్డాయి. మరి ఎప్పుడు విడుదల చేస్తారు అనేది తెలియదు. ఇక చాలా వరకు పెండింగ్ సినిమాలు అన్నీ కూడా కరోనా దెబ్బకు మొదలయ్యే అవకాశాలు లేక ఆందోళనలో ఉన్నాయి. 

 

అగ్ర హీరోల సినిమాలకు కూడా దాదాపుగా అదే గతి పట్టింది. ఇప్పుడు షూటింగ్ లు వద్దు అని అనుమతులకు ఆంక్షలను జోడించిన నేపధ్యంలో సీరియల్స్ అన్నీ కూడా వాయిదా పడుతున్నాయి. రెండు సీరియల్స్ మొదలు పెట్టి ఒక నెల రోజులకు సరిపడా షూటింగ్ ని ప్లాన్ చేసారు. ఈ తరుణంలో షూటింగ్ లకు షాక్ ఇచ్చింది పళని సర్కార్. చూడాలి మరి ఎప్పుడు అనుమతులు వస్తాయో...

మరింత సమాచారం తెలుసుకోండి: