ఇప్పుడు సోషల్ మీడియాలో సినిమాలకు మంచి ఆదరణ వస్తున్న నేపధ్యంలో హీరోలు హీరోయిన్ లు అందరూ కూడా సోషల్ మీడియాలో సినిమాలను విడుదల చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. సోషల్ మీడియా పుణ్యమా అని ఓటీటీ ఫ్లాట్ ఫాం కి మంచి స్పందన రావడం తో ఇప్పుడు సినిమాలను అందులో విడుదల చేయడానికి గానూ ప్లాన్ ఎక్కువగా చేస్తున్నారు. ఇక చిన్న హీరోయిన్ లు పెద్ద హీరోయిన్ లు కూడా ఓటీటీ లో సినిమాలతో పాటుగా వెబ్ సీరీస్ ల మీద కూడా ఎక్కువగా దృష్టి పెడుతున్నారు అని చెప్పవచ్చు. 

 

ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు సినిమాల్లో అవకాశాలు రాని జనాలు అందరూ కూడా ఓటీటీ లో సినిమాలను విడుదల చేయడానికి ఎక్కువగా ప్లాన్ చేస్తున్నారు. అగ్ర హీరోయిన్ లు కూడా సినిమా అవకాశాలు తగ్గుతున్న నేపధ్యంలో ఓటీటీ లో సినిమాలను విడుదల చేయడానికి ప్లాన్ ఎక్కువగా చేస్తున్నారు. తాజాగా సీనియర్ హీరోయిన్ హన్సిక కూడా సోషల్ మీడియా మీద ఫోకస్ చేసి యాక్టివ్ గా ఉంటుంది. ఇక ఇది పక్కన పెడితే ఇప్పుడు ఆమె సోషల్ మీడియా మీద ఫోకస్ చేసి వెబ్ సీరీస్ ని విడుదల చెయ్యాలి అని చూస్తుంది అని సమాచారం. 

 

ఇటీవల ఒక దర్శకుడి తో ఆమె చర్చలు కూడా జరిపింది అని టాక్. భాగమతి ఫేం అశోక్ దర్శకత్వంలో రూపొందే ఓ వెబ్ సీరీస్‌లో నటించడానికి గానూ ఆమె ఓకే చెప్పింది అని సమాచారం. ఈ వెబ్ సీరీస్ లో సమాజంలో మహిళలు పడే కష్టాల మీద ఆమె సినిమా చేయడానికి రెడీ అయింది అని సమాచారం. చూడాలి మరి ఈ వెబ్ సీరీస్ ని ఎప్పుడు తీసుకుని వస్తారు అనేది. ఇక ఆమె ఇప్పుడు తమిళ్ లో రెండు సినిమాలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: