నందమూరి బాలకృష్ణ కెరీర్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమాల్లో ఒకటి లెజెండ్. ఈ సినిమా సాధించిన విజయం గాని ఈ సినిమా నమోదు చేసిన రికార్డ్ లు గాని అన్నీ కూడా ఒక సంచలనం అనే చెప్పాలి. ఈ సినిమాలో బాలయ్య నటన చూసి చాలా మంది షాక్ అయ్యారు. ఈ సినిమాలో అప్పటి వరకు చూడని విధంగా బాలకృష్ణ ప్రేక్షకులను అలరించారు అనే చెప్పాలి. ఇక ఈ సినిమా కథ నుంచి ఈ సినిమాలో ఉండే యాక్షన్ సన్నివేశాల వరకు ప్రతీ ఒక్కటి కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి అనే చెప్పాలి. ఈ సినిమాలో బాలయ్య డైలాగ్స్ కి కూడా మంచి స్పందన వచ్చింది. 

 

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఉండే రాజకీయ కోణం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో విలన్ గా నటించే జగపతి బాబు రాజకీయ నాయకుడు. ఆయన అత్యంత బలంగా ఉంటాడు. ఆయనను బాలకృష్ణ ఎదుర్కోవడం అదే విధంగా తన తండ్రి ని రాజకీయ కోణం తో చంపేయడం అన్నీ కూడా ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకున్నాయి అనే చెప్పాలి. ఈ సినిమాలో ఉండే ప్రతీ సీన్ కూడా ఈలలు వేయించింది అనే చెప్పాలి. ఈ సినిమా తర్వాత బాలయ్య రేంజ్ కూడా బాగా పెరిగింది అనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఆయన బోయపాటి దర్శకత్వంలో చేస్తున్నారు. 

 

ఈ సినిమాలో కూడా ఆయన రాజకీయ నాయకుడి గా నటించే అవకాశం ఉందనే ప్రచారం ఇప్పుడు ఎక్కువగా జరుగుతుంది మరి. చూడాలి ఆయన ఏ విధంగా నటిస్తారు అనేది. ఈ సినిమా తర్వాత బాలయ్య మల్టీ స్టారర్ సినిమా రానా తో కలిసి చేసే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమాలో బాలయ్య కీలక పాత్రలో నటిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: