బాలీవుడ్ లో అవకాశాల కోసం వెళ్లి టాలీవుడ్ లో ఆదరణ కోల్పోయి తమిళంలో అవకాశాల కోసం ఎదురు చూస్తూ కన్నడం లో ఒక ఆఫర్ రావడంతో ఇప్పుడు అక్కడ ఒక సినిమా చేస్తూ తిరిగి టాలీవుడ్ లో స్టార్ హీరోలతో సినిమా చెయ్యాలి అని చూస్తున్న హీరోయిన్ ఇలియానా. ఈ గోవా బ్యూటి ఏదో ఊహించుకుని ముంబై విమానం ఎక్కితే ఇక్కడ ఖాళీ లేదు చాలా మంది ఉన్నారు అని ఆమెను పక్కన పెట్టేసరికి మళ్ళీ రకరకాల భాషల్లో సినిమాల కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఇప్పుడు మళ్ళీ మన ఫిలిం నగర్ లో తేలింది. 

 

హీరోయిన్ గా నేను చేస్తాను నేను ఉన్నాను అంటుంది ఈ గోవా అమ్మాయి. అయితే అవకాశాలు మాత్రం ఆమెకు పెద్దగా రావడం లేదు. వచ్చినా సరే మాజీ హీరోయిన్ లు చేసే పాత్రలు మాత్రమే ఆమెకు వస్తున్నాయి. దీనితో ఆమె ఇప్పుడు ఏం చెయ్యాలో అర్ధం కాక అవస్థలు పడుతుంది. ఈ తరుణంలో ఒక ఆఫర్ వచ్చింది ఆమెకు. నితిన్ హీరోగా బాలీవుడ్ చిత్రం ‘అంధాదున్‌’ రీమేక్ లో ఆమెకు ఒక ఆఫర్ ఇచ్చారట. మేర్ల‌పాక గాంధీ ద‌ర్శ‌క‌త్వంలో వస్తున్న ఈ సినిమాలో టబు చేసిన ఒక నెగటివ్ పాత్రను ఇలియానా కు ఇవ్వాలి అని చూసారు.

 

ఇక హింది లో చేసిన టబు తోనే తెలుగు లోను చెయ్యాలి అని భావించి అడగగా నాకు ఖాళీ లేదు అని ఆమె చెప్పారు. దీనితో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శిల్పా శెట్టి ని అడిగారట. అయితే ఆమె కూడా నో అనడం తో యాంకర్ అనసూయ లేదా ఇలియానా ను తీసుకోవాలని చూసి ఇలియానా ను అడగాగా లేదు కాదు నో అని చెప్పింది అని సమాచార౦. మరి ఎవరిని తీసుకుంటారు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: