టాలీవుడ్ లో బాలయ్య సినిమాలు అనగానే గతంలో ఒక మంచి క్రేజ్ ఉండేది. అయితే ఇప్పుడు మాత్రం క్రేజ్ అనేది భారీగా తగ్గింది అనే చెప్పాలి. ఆయన కూడా దాదాపుగా సినిమాల విషయంలో గతంలో మాదిరిగా దూకుడు గా వెళ్ళకుండా ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు అనే చెప్పాలి. అగ్ర హీరో హోదా ఉన్నా సరే ఆయనకు కమర్షియల్ హీరో అనే హోదా మాత్రం రాకపోవడం తో చాలా మంది దర్శక నిర్మాతలు ఆయన తో సినిమా చేసే విషయంలో ఆలోచనలో పడ్డారు అనే ప్రచారం బాగా జరుగుతుంది. ఇక బాలయ్య కూడా చాలా తక్కువ బడ్జెట్ లో సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నారు. 

 

దీని తో ఆయన తో సినిమా అనగానే చాలా మందికి కాస్త కష్టంగా ఉంటుంది. ఆయన సినిమాలను గతంలో ఆత్రం గా చూసే ఫాన్స్ కూడా ఇప్పుడు పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయడం లేదు అనే చెప్పాలి. ఇక ఇప్పుడు బాలయ్య కొన్ని పాత్రలు చేయడానికి సిద్దంగా ఉన్నారు అనే ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఆయన తమిళ సినిమాల్లో కూడా నటించే అవకాశం ఉంది అని టాక్ వినపడుతుంది. తమిళ సినిమాల్లో ఆయన  ఒక సినిమా చెయ్యాలి అని ఎప్పటి నుంచో అనుకుంటున్నా సరే అది మాత్రం సాధ్యం కావడం లేదు. ఇప్పుడు మాత్రం ఆ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకుని వెళ్తున్నారట. 

 

సూర్య కి తండ్రి గా ఒక సినిమాలో ఆయన చేసే అవకాశం ఉంది అని సమాచారం. దీనికి సంబంధించి ఆయనను ఒక దర్శకుడు అడిగారు అని సమాచారం. బాలయ్య కు తమిళనాడు లో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బాలయ్య కూడా తమిళనాడు లో సినిమాలు చేస్తే మంచి క్రేజ్ వచ్చే అవకాశం ఉంది అని భావిస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: