'నాపేరు సూర్య' అలాంటి దారుణమైన డిజాస్టర్ తర్వాత ఏడాదిన్నర గ్యాప్ ఇచ్చి 'అల వైకుంఠపురంలో' ఈ సినిమా తో అదిరిపోయే విజయాన్ని సాధించారు బన్నీ. ఈ ఏడాది సంక్రాంతి పండుగకు రిలీజ్ అయిన ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ దగ్గర నాన్ బాహుబలి రికార్డులను పగలగొట్టి సరికొత్త రికార్డులను సృష్టించింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈ సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని సాధించారు అల్లు అర్జున్. అంతేకాకుండా రెమ్యూనరేషన్ విషయంలో సినిమాకి 25 కోట్లు తీసుకుని ఇంకా లాభాల్లో 25 శాతం వాటా కూడా దక్కించుకున్నట్లు టాక్ అప్పట్లో వచ్చింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' అనే సినిమా చేస్తున్నారు.

 

పాన్ ఇండియా తరహాలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే సినిమాకి సంబంధించి రెమ్యూనరేషన్ విషయంలో అల్లు అర్జున్ భయంకరంగా పెంచడం జరిగిందట. ఇదిలా ఉండగా ప్రస్తుతం మహమ్మారి కరోనా వైరస్ రావడంతో చాలా మంది ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు మరియు హీరోయిన్లు తమ రెమ్యూనరేషన్ లు తగ్గించుకోవటం జరిగింది. ఇలాంటి సమయంలో అయినా ప్రొడ్యూసర్ కష్టాలను దృష్టిలో పెట్టుకొని బయట పరిస్థితులను అర్థం చేసుకుని అల్లు అర్జున్ తన రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలనే డిమాండ్ గట్టిగా వినబడుతోంది.

 

పైగా సొంత బ్యానర్ ఉండటంతోపాటు తండ్రి నిర్మాతగా ఉన్న తరుణంలో...ప్రొడ్యూసర్ల కష్టాలను దృష్టిలో పెట్టుకొని అల్లు అర్జున్ రెమ్యునేరేషన్ తగ్గించుకోకపోతే భారీ దెబ్బ ఖాయం అనే టాక్ నడుస్తోంది. ఇదిలా ఉండగా 'పుష్ప' సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ గా, గంధపు చెక్కల స్మగ్లర్ గా నటించనున్నట్లు టాక్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆగస్టులో మొదలవుతుందని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: