టాలీవుడ్ లో ఆర్ఆర్ఆర్ సినిమా కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడం కూడా ఇప్పుడు చాలా మందికి కష్టంగా ఉంది. ఈ సినిమా ఎప్పుడు విడుదల చేస్తారా అంటూ ప్రతీ ఒక్కరు కూడా ఇప్పుడు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. కాని సినిమా మాత్రం ఆలస్యం అయ్యే అవకాశాలే ఎక్కువగా ఇప్పుడు కనపడుతున్నాయని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో కీలకంగా మారిన  కొన్ని సన్నివేశాలకు సంబంధించి ఇప్పుడు చిత్ర యూనిట్ బాగా ఇబ్బంది పడుతుంది అని సినీ పరిశీలకులు అంటున్నారు. 

 

ముఖ్యంగా హీరోయిన్ ల విషయంలో ఇప్పుడు చాలా ఇబ్బందులు వస్తున్నాయి. వాళ్ళు ఇద్దరూ కూడా వేరే ప్రాంతం లో ఉండటం అక్కడ కరోనా ఎక్కువగా ఉండటం వాళ్ళు ఇక్కడికి వచ్చే అవకాశం లేకపోవడం తో అసలు వాళ్ళు షూటింగ్ కి వస్తారా లేదా  అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు అలియా భట్ రాజమౌళి కి ఫోన్ చేసి తాను షూటింగ్ కి రావడం కష్టమే అని చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. తాను ముంబై లో ఉన్నా అని కేసులు భారీగా పెరుగుతున్నాయని షూటింగ్ కి రాలేను అని చెప్పినట్టు తెలుస్తుంది. 

 

తాను ఇప్పటిలో ముంబై నుంచి వచ్చే అవకాశం లేదని చెప్పెసినట్టు టాక్. ఆమె రామ్ చరణ్ పక్కన హీరో యిన్ గా ఈ సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అనేది చెప్పాలి అంటే కనీసం షూటింగ్ అయినా సరే మొదలు కావాల్సి ఉంటుంది. కాని షూటింగ్ మాత్రం మొదలయ్యే సూచనలు దాదాపుగా లేవు అని తెలుస్తుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా లేట్ అవ్వడం ఖాయమని అంటున్నారు మరి. ఎం చేస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వచ్చే ఏడాది ఈ సినిమా వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: