ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్లలో ఒకరు రష్మిక మందన. తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం రష్మిక మందన కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన కెరీర్ని ఎంతో విజయవంతంగా ముందుకు తీసుకు వెళుతూ వరుస అవకాశాలు దక్కించుకుంటుంది రష్మిక మందన. ఎన్నో బ్లాక్బస్టర్ విజయాలను కూడా తన ఖాతాలో వేసుకుంటుంది. ఎక్కడ అందాల ఆరబోత చేయకుండానే కేవలం తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులందరికీ ఫిదా చేసింది ఈ ముద్దుగుమ్మ. తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయంలోనే ఎక్కువ క్రేజ్ సంపాదించిన హీరోయిన్లలో టాప్ ప్లేస్ లో నిలిచింది. 

 

 ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమా తో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుని స్టార్ హీరోయిన్ గా మారిపోయిన రష్మిక మందన ఆ తర్వాత నితిన్ హీరోగా వచ్చిన భీష్మ సినిమాలో మరో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇలా వరుస బ్లాక్బస్టర్ విజయాలను సొంతం చేసుకోవడంతో ఈ అమ్మడి క్రేజ్  అమాంతం పెరిగిపోయింది. దీంతో దర్శక నిర్మాతలు అందరూ వరుస ఆఫర్లతో రష్మిక మందన వద్దకు క్యూ కట్టారు. ఈ క్రమంలోనే నాని హీరోగా నటించిన సినిమా నుంచి రష్మిక మందన కు ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. అయితే రష్మిక మాత్రం నాని సినిమా ఆఫర్ ను  తిరస్కరించినట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తుంది. 

 


 విజయ్ దేవరకొండ తో  టాక్సీవాలా సినిమాను తెరకెక్కించి మంచి విజయం అందుకున్న రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో నాని హీరోగా శ్యామ్  సింగరాయి అనే చిత్రం రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో  నాని సరసన ముగ్గురు హీరోయిన్లు ఉండబోతున్నారట. ఒక పాత్ర కోసం ఇప్పటికే సాయి పల్లవి ఎంచుకున్నట్లు వార్తలు వస్తూ ఉండగా... మరో హీరోయిన్ పాత్రకు రష్మిక సంప్రదించినట్లు తెలుస్తోంది. కానీ రష్మిక మాత్రం ఈ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. మరి ఈ ఆఫర్ తిరస్కరించడానికి కారణం ఏమిటి అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: