రష్మిక గ్లామర్ కి పోత పోసిన రూపం. గ్రామర్ కూడా పుష్కలంగా ఉన్న ప్రెసెంట్ యాక్ట్రెస్ యూత్ కళ్ళల్లో ఇల్లు కట్టేసుకుని చలో కలల తీరాలకు అంటూ కవ్వించే నెరజాణ. ఇక రష్మిక లక్ ఏంటి అంటే ఆమె వరసగా చేసిన సినిమాలు హిట్ అయ్యాయి.

IHG

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఆమె నటించిన సరిలేరు నీకెవ్వరు మూవీ టాప్ రేంజి హిట్ అయింది. ఈ ఏడాది సంక్రాంతికి ఈ మూవీకి వచ్చి సందడి చేసింది. ఇక ఆమె చేసిన భీష్మ మూవీ కూడా సూపర్ హిట్. అలాగే ఈ మూవీ తరువాత రష్మిక పుష్ప మూవీలో అల్లు అర్జున్ పక్కన నటిస్తోంది. ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యే చాన్సెస్ ఉన్నాయి. పైగా ఈ మూవీ పాన్ ఇండియా మూవీగా తీస్తున్నారు.

IHG

ఇదిలా ఉండగా రష్మిక ఒక కీలకమైన డెసిషన్ తీసుకుంది అంటున్నారు. ఆమె ఇకపైన నటించే సినిమాల్లో తాను ఒక్కరే హీరోయిన్ గా ఉండాలనుకుంటోందిట. అంటే సింహం సింగిల్ గానే రావాలట. మరొకరితో స్క్రీన్ చేసుకోను అని తన కచ్చితంగా చెప్పేస్తుందిట. ఈ మధ్యనే ఓ మిడిల్  రేంజి హీరో సినిమాకు ముగ్గురు హీరోయిన్లు కావాల్సివచ్చారట. అందులో ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఒక పాత్ర కోసం రష్మికను చిత్ర యూనిట్ సంప్రదిస్తే తాను సింగిల్ హీరోయిన్ గానే చేస్తానని తన కండిషన్ని రష్మిక బయటపెట్టిందని అంటున్నారు.

IHG

ఇక సినిమాకు కోటీ 20 లక్షల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే రష్మిక తన సినిమాల్లో తానే వెలిగిపోవాలనుకుంటోంది. ఆ సినిమా హీరో తన ఒక్కరి సొంతమే కావాలని కూడా అనుకుంటోంది. మరి రష్మిక ఈ రకమైన డిమాండ్ ఇపుడున్న సిట్యువేషన్ లో వర్కౌట్ అవుతుందా అన్నది పెద్ద ప్రశ్న. ఎందుకంటే గ్లామర్ ఫీల్డ్ ఇది. ఒక్కరే హీరోయిన్ని పెట్టి సినిమా తీసే రోజులు పోయాయి. పెద్ద హీరోల నుంచి అంతా ఇద్దరు ముగ్గురు హీరోయిన్లతోనే సినిమాలు చేస్తున్నారు. చూడాలి మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: