టాలీవుడ్ లో కొన్ని కొన్ని సినిమాలు కొందరు హీరోయిన్ లు అలా నిలిచిపోయారు. అందులో ప్రధానంగా చెప్పుకునే హీరోయిన్ సౌందర్య. ఆమె నటన గాని ఆమె చేసిన సినిమాలు గాని ఆమె పోషించిన పాత్రలు గాని అన్నీ కూడా ఒక సంచలనం అని ఆమె సినిమాలు చూసిన ఎవరు అయినా సరే రెండో మాట లేకుండా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఆమె కెరీర్ లో వెంకటేష్ హీరో గా వచ్చిన సినిమాల్లో చేసిన పాత్రలు అయితే ఆమె రేంజ్ ని మరో రేంజ్ కి తీసుకుని వెళ్ళాయి అని చాలా మంది అంటూ ఉంటారు. ఆమె కెరీర్ లో వెంకటేష్ పక్కన చేసిన ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా అయితే ఆమె కెరీర్ లో సూపర్ హిట్. 

 

ఇక ఆ సినిమాలో ఆమెకు పిల్లలు పుట్టే అవకాశం లేదు అని డాక్టర్ నుంచి ఆమెకు తెలియగానే ఆమె నటన చూసి టాలీవుడ్  కన్నీరు పెట్టింది.  ఆ సీన్ లో ఆమె నటించడం కాదు జీవించింది అని సినిమా చూసిన ఎవరు అయినా సరే చెప్తారు అంటే ఆమె ఆ రేంజ్ లో చేసింది అని చెప్పాలి. ఆమెకు ఆ సినిమా చాలా మంచి పేరు తీసుకొచ్చింది అని చెప్పాలి. ఆ సినిమాలో ఆమె వెంకటేష్ కి సెకండ్ ఎఫైర్ ఉంది అని తెలిసిన సమయంలోనే అలాగే కోటా శ్రీనివాసరావు ముందు ఎమోషనల సన్నివేశాల్లో ఆమె నటించిన సందర్భం లో గాని ఆమె నటన మరో రేంజ్ లో ఉంది. 

 

ఇక ఆ సినిమా విషయానికి వస్తే వెంకటేష్ కెరీర్ లో అది బిగ్గెస్ట్ హిట్ గా చెప్తారు. ఆ సినిమాలో ఆయన నటన తో పాటుగా ప్రతీ ఒక్కరి నటన కూడా టాలీవుడ్ ప్రేక్షకులను చాలా బాగా ఆకాట్టుకుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: