మోహన్ బాబు కెరీర్ లో వచ్చిన అతి పెద్ద హిట్స్ లో ఒకటి... పెదరాయుడు. ఈ సినిమా ఆయనకు తీసుకొచ్చిన పేరు ఈ సినిమా సాధించిన విజయం గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది. ఈ సినిమాలో ఆయన నటన... ఈ సినిమాలో ఆయన పోషించిన పాత్రలు ఇతర నటుల నటన అదే విధంగా భాను ప్రియ పోషించిన పాత్ర అన్నీ కూడా సినిమా స్థాయి ని మరో రేంజ్ కి తీసుకుని వెళ్ళాయి అని చెప్పాలి. ప్రతీ సీన్ లో ప్రతీ నటుడు కూడా తమ స్తాయికి తగిన విధంగా నటించారు ఆనే చెప్పాలి. ఇక అది అలా ఉంటే... 

 

ఈ సినిమాలో ఆస్తి పేపర్లు అడుగుతుంది సౌందర్య. ఆస్తి పేపర్లు అడిగిన సమయంలో... మోహన్ బాబు ఒక డైలాగ్ చెప్తారు. ఇక ఆ సీన్ మొత్తం కూడా ఆమె తనకు ఆస్తి, బీరువా తాళల గురించి అడుగుతూ ఉండగా భాను ప్రియ ముందు ఆమె ఆవేశంగా కనపడుతుంది. ఆ సీన్ లో ఆమె జీవించింది అనే చెప్పాలి. ఇక మోహన్ బాబు వెంటనే ఆమెను పిలిచి ఆస్తి పత్రాలు, ఆమెను పిలిచి బీరువా తాళాలు ఇస్తారు. ఆ సీన్ లో కూడా ఆమె కన్నీళ్లు పెడుతుంది. ఇక ఆ సీన్ ఆమె కెరీర్ లో ది బెస్ట్ గా చెప్తారు సినిమా చూసిన ఎవరు అయినా సరే. 

 

ఆ విధంగా ఆ సినిమాలో ఆమె తన లో ఉన్న ఒక మంచి నటిని టాలీవుడ్ కి పరిచయం చేసారు అనే చెప్పాలి. మోహన్ బాబు తో ఆమె చాలా సినిమాలు చేసారు గాని ఆ సినిమా మాత్రం ఆమె ఒక రేంజ్ లో చేసింది అని చెప్పాలి. ఆ సినిమా ఇటీవల 25 ఏళ్ళు పూర్తి చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: