రానా కెరీర్ లో భారీ అంచనాలతో వచ్చి సూపర్ హిట్ అయిన సినిమా... నేనే రాజు నేనే మంత్రి. ఈ సినిమా తర్వాత రానా ఇమేజ్ ఒక రేంజ్ లో పెరిగింది. ఈ సినిమాలో రానా నటనకు చాలా మంచి మార్కులు పడగా హీరోయిన్ గా చేసిన కాజల్ కి కూడా చాలా మంచి మార్కులు పడ్డాయి. ఆమె ఈ సినిమాలో రానా భార్యగా నటించి మెప్పించారు. ఈ సినిమా విజయంలో ఆమె పాత్రకు కూడా మంచి పేరే వచ్చింది అని చెప్పాలి. ఈ సినిమాలో రానా కూడా తన స్థాయికి తగిన విధంగా నటించాడు అనేది అర్ధమవుతుంది. నేనే రాజు నేనే మంత్రి సినిమా కథకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. 

 

సినిమా కథలో రానా మినహా మరో హీరో అయితే ఆ రేంజ్ లో సినిమా ఉండే అవకాశం లేదు అని చాలా మంది కామెంట్స్ చేసారు సినిమా చూసి. ఆ సినిమా తర్వాత కథ భిన్నంగా ఉంటే చాలు సినిమా చేయడానికి దర్శక నిర్మాతలు ముందుకు వచ్చి రానా కు కథలు చెప్తున్నారు. ఇక రానా కూడా అక్కడి నుంచి జాగ్రత్తగానే సినిమాలు చేస్తున్నాడు అని చెప్పాలి. ఈ సినిమాలో రానా పోషించిన పాత్ర కాజల్ పోషించిన పాత్ర చాలా కొత్తగా ఉన్నాయి టాలీవుడ్ జనాలకు. పిల్లలు లేని భార్య గా ఆమె నటిస్తుంది. 

 

భార్య కోరిక మేరకు నటించే భర్తగా రానా చాలా బాగా ఆకట్టుకున్నాడు అనే చెప్పాలి. ఈ సినిమా ఒక రేంజ్ లో విజయం సాధించడమే కాదు రాణాకు చాలా మంచి పేరు తీసుకుని వచ్చింది. అప్పటి వరకు కాజల్ లో అంత మంచి నటి ఉంది అని చాలా మందికి పరిచయం కూడా లేదు అనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: