టాలీవుడ్ లో కొందరు హీరోయిన్ లు గ్లామర్ చూపించినా లేకపోయినా నటన పరంగా మాత్రం చాలా బాగా ఆకట్టుకుంటూ ఉంటారు. వారి నటన వారు పోషించిన పాత్రలకు ముందు నుంచి కూడా మంచి డిమాండ్ ఉంటుంది. అందులో కళ్యాణి ఒకరు. ఆమె చేసిన పాత్రలు ఆమె నటించిన సినిమాలు తక్కువే అయినా సరే ఆమెకు మాత్రం చాలా మంచి పేరు వచ్చింది. ఆమె భార్య పాత్రలకు సరిగా సరిపోయింది అని చాలా మంది ఇప్పటికి కూడా అంటూ ఉంటారు. అగ్ర హీరోల సినిమాల్లో ఆమె భార్య పాత్రలు కూడా చేసారు. 

 

లెజెండ్ సినిమాలో ఆమె భార్య పాత్రలో  నటించారు. జగపతి బాబుకి భార్యగా చేసారు ఆమె. అదే విధంగా మరికొన్ని సినిమాల్లో ఆమె భార్య పాత్రలను పోషించారు. ఆ పాత్రలకు చాలా మంచి డిమాండ్ వచ్చింది అప్పట్లో. ఇక ఆమె కెరీర్ పీక్ స్టేజి లో ఉన్న సమయంలో సినిమాలకు కథలను సరిగా ఎంపిక చేసుకోవడం రాక దూరం అయ్యారు అని అంటారు ఆమెను దగ్గరగా గమనించిన వారు. ఆమె కొన్ని కొన్ని సినిమాల్లో కథలను సరిగా ఎంపిక చేసుకుని ఉంటే మంచి సినిమాలు చేసి ఉంటే మాత్రం స్టార్ హీరోయిన్ గా మరికొన్ని రోజులు ఉండే వారు అని అంటారు. 

 

కాని ఆమె ఆ ఇమేజ్ ని కాపాడుకోలేదు అనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఆమె సినిమాలకు దాదాపుగా దూరంగానే ఉన్నారు.  మంచి పాత్రలు వచ్చినా సరే ఆమె మాత్రం చేయడం లేదు. ఎందుకు చేయడం లేదు అనేది తెలియదు గాని ఆమె మాత్రం చేయడం లేదు. ఇక ఇప్పుడు ఆమె అమెరికాలో ఉన్నారు. ఆమె అక్కడ ఒక సీరియల్ లో చేస్తున్నారు అని అంటున్నారు. ఇక ఆమె తెలుగులో మంచి పేరే తెచ్చుకున్నారు గాని తమిళం లో చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: