టాలీవుడ్ లో చాలా మంది గోపి చంద్ ని హీరో పాత్రలో కంటే కూడా విలన్ పాత్రలోనే ఎక్కువగా చూస్తూ ఉంటారు. అతను హీరో పాత్ర కంటే కూడా విలన్ పాత్రలోనే సూపర్ గా సెట్ అవుతాడు అని చాలా మంది అతని సినిమాలు చూసి కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. ఆయన కూడా హీరో పాత్రల మీద దృష్టి పెట్టి విలన్ గా మంచి అవకాశాలు వచ్చినా సరే చేయడానికి అంతగా ఆసక్తి చూపించలేదు. ఆయన ఎప్పుడు అయితే హీరో పాత్రలకు వచ్చారో ఆయన లో నటన అనేది ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో కనపడలేదు అని చాలా మంది అంటూ ఉన్నారు. 

 

ఇప్పుడు ఆయన రెండు మూడు సినిమాల్లో హీరో పాత్రలు చేస్తున్నా సరే అంత క్రేజ్ లేదు గాని ఇప్పుడు ఆయన విలన్ పాత్ర చేసే అవకాశం ఉంది అనే వార్త రాగానే జనాలు అసలు ఆయన చేసే హీరో పాత్ర ఏ సినిమాలో అంటూ పెద్ద ఎత్తున దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అగ్ర హీరో గా ఉన్న ఆయన ఇప్పుడు విలన్ గా నటిస్తే ఎవరు చూస్తారు అనేది కూడా జనాలు మాట్లాడే మాట. ఇక ఇప్పుడు ఆయన మాత్రం విలన్ పాత్రలు మినహా మరో పాత్ర చేయవద్దు అనే ఆలోచనలో కూడా ఉన్నారు అని టాలీవుడ్ లో అంటున్నారు మరి. 

 

ఇప్పుడు ఆయనకు బాలీవుడ్ తో పాటుగా టాలీవుడ్ లో కూడా విలన్ పాత్రలు చేసే అవకాశం వచ్చింది అని  జనాల మాట. మరి ఆయన ఏ విధంగా విలన్ పాత్రలు చేస్తారు అనేది త్వరలోనే ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఆయన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. ఇవి పూర్తి కాగానే చేస్తాడు అని ఇక హీరోగా చేయడు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: