పుష్ప సినిమా కోసం బన్నీ చాలా కష్టపడుతున్నాడు. అల్లు అర్జున్ కెరీర్ లోనే ఈ సినిమా ఒక సవాల్ అని చాలా మంది అంటున్నారు. ఈ సినిమా కోసం అతను ఎన్నడు లేని విధంగా కష్టపడుతున్నాడు అని టాలీవుడ్ జనాలు అంటున్నారు. అగ్ర హీరోల సినిమాల విషయంలో ఏ రేంజ్ లో చర్చలు ఉంటాయో అందరికి తెలిసిందే. ఇప్పుడు పుష్ప గురించి కూడా అలాగే చర్చలు  జరుగుతున్నాయి. ఇప్పుడు టాలీవుడ్ లో ఒక వార్త హాట్  టాపిక్ గా మారింది ఈ సినిమా గురించి. ఈ సినిమాలో రమ్యకృష్ణ ఒక కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది అంటున్నారు. 

 

ఈ సినిమాలో ఆమె పాత్ర విషయంలో ఇప్పుడు సుకుమార్ అందంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు అని అన్నీ రెడీ అయితే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టే అవకాశం ఉంది అని అంటున్నారు. ఆమె తోనే ఓపెనింగ్ షాట్  ఉండే అవకాశాలు ఉన్నాయి అని టాలీవుడ్ జనాలు అంటున్నారు మరి. అది ఎంత వరకు నిజం అనేది తెలియదు గాని ఇప్పుడు టాలీవుడ్ లో పరిస్థితి ఆధారంగా చూస్తే..... ఈ సినిమాలు మొదలు పెట్టే అవకాశం దాదాపుగా లేదు అనే టాక్ వినపడుతుంది. సినిమాలను నిర్మించాలి అనే ఆలోచన కూడా చాలా మంది నిర్మాతలు చేయడం లేదు. 

 

ఇక ఈ సినిమాను ఎప్పుడు మొదలు పెట్టే అవకాశం ఉంది అనేది చెప్పడం కాస్త కష్టమే. టాలీవుడ్ లో చాలా వరకు ఇప్పుడు అగ్ర హీరోల సినిమాలకు బ్రేక్ వేస్తున్నారు అని చెప్పాలి మరి. ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుంది అనేది చూడాలి. రెండు మూడేళ్ళ పాటు ఇదే పరిస్థితి ఉంటుంది. ఇక ఈ సినిమాలో నటించే పాత్రల ఎంపిక అనేది జరుగుతుంది ఇప్పుడు అని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: