తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోల భార్య పాత్రలకు సెట్ అయ్యే హీరోయిన్లు కొంతమంది ఉన్నారు అని చెప్పాలి. భార్య పాత్రలో నటించి ఆ పాత్రలకు వన్నె తెచ్చిన హీరోయిన్లు చాలా తక్కువ మందే. ఇలాంటి హీరోయిన్లలో ఒకరు మీనా.  నిన్నటి తరంలో హీరోయిన్లు స్టార్ హీరోయిన్గా కొనసాగి ఎంతో హవా నడిపించింది. తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. దాదాపు దశాబ్ద కాలానికి పైగా తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా అందరి హీరోల సరసన నటించింది




. అయితే స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న అప్పటినుంచే భార్య పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది మీనా. ఇప్పటికీ కూడా పలు సినిమాల్లో భార్య పాత్రలో నటిస్తూ ఆ పాత్రకే వన్నె తెస్తుంది.ముఖ్యంగా భార్య పాత్రలో హావభావాలు పండించడంలో మీనా తర్వాతే ఎవరైనా అని చెప్పాలి. కుటుంబంలోని భావోద్వేగాలను పండిస్తూ తన నటనతో సినిమా చూస్తున్న ప్రేక్షకుల అందరినీ మెప్పిస్తుంది. అంతే కాకుండా ఒక భార్య కు ఎంత ఓపిక ఉండాలి అన్నది తన నటనతో చేసి చూపిస్తూ ఉంటుంది. ఆ రోజుల్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే వెంకటేష్ సరసన సూర్యవంశం సినిమాలో నటించి ఎంతగానో ఆకట్టుకుంది మీనా


అయితే రజనీకాంత్ హీరోగా జగపతి బాబు కీలక పాత్రలో నటించిన చిత్రం కథానాయకుడు. ఈ సినిమాలో  సూపర్ పాత్రలో రజనీకాంత్ నటిస్తే ఒక సాదా సీదా బార్బర్ పాత్రలో  జగపతిబాబు నటిస్తాడు, ఇక ఈ సినిమాలో జగపతి బాబు భార్యగా మీనా నటిస్తోంది. అయితే జగపతిబాబు ఎంతో పేదరికంలో కనీసం ఇల్లు గడవడానికి కూడా కష్టంగా ఉన్న పాత్రల్లో నటిస్తూ తన నటనతో ఎంతగానో ఆకట్టుకుంటాడు  అని చెప్పాలి. అదే సమయంలో జగపతి బాబు భార్య పాత్రలో నటించిన మీనా ఎన్ని కష్టాలు వచ్చినా భర్తను వెన్ను తడుతూ ఉంటుంది, ఈ సినిమా చూస్తున్నంత సేపు ఇంత  అర్థం చేసుకుని భార్య దొరికితే ఎంత అదృష్టమో అని ప్రేక్షకులు బావించేంతలా పాత్రలో  ప్రభావితం చేస్తోంది మీనా.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: