టాలీవుడ్ లో ఇప్పుడు సినిమాలకు మార్కెట్ పెరుగుతున్న నేపధ్యంలో రాజకీయ నాయకులు ఎక్కువగా పెట్టుబడి పెట్టాలి అని భావిస్తున్నారు. అగ్ర హీరోల సినిమాల్లో ఎక్కువగా పెట్టుబడి పెట్టే ఆలోచనలో ఉన్నారు నాయకులు అనే వార్తలు ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చదువుతున్నాం. స్టార్ హీరోల సినిమాల్లో పెట్టుబడి పెట్టడం అంటే ఇక కాసుల వర్షమే ప్రీ రిలీజ్ మార్కెట్ నుంచి పాటల వరకు... అలాగే వసూళ్లు ఇక అదనంగా వచ్చే ఆదాయం దానికి తోడు పాపులారిటి అన్నీ కూడా ఇప్పుడు దాదాపుగా నాయకులను ఆకట్టుకుంటున్నాయి.

 

అయితే ఇప్పుడు సినిమాల విషయంలో నాయకులు వెనక్కు తగ్గారు అనే ప్రచారం టాలీవుడ్ లో ఎక్కువగా జరుగుతుంది. అంత స్వేచ్చగా వాళ్ళు పెట్టుబడి పెట్టడానికి ముందుకు రావడం లేదు అని టాలీవుడ్ లో టాక్ మరి. నిజం ఎంత అనేది తెలియదు గాని చాలా వరకు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. దాదాపు రెండు మూడేళ్ళ పాటు సినిమాలకు దూరంగా ఉండటమే మంచిది అనే భావన లో టాలీవుడ్ జనాలు ఉన్నారు. ఇప్పుడు అగ్ర హీరోల సినిమాల విషయంలో కాస్త భయపడే పరిస్థితి అయితే ఉంది. 

 

అందుకే  దాదాపుగా వారు పెట్టుబడులకు దూరంగా ఉన్నారు అని టాలీవుడ్ లో అంటున్నారు. ఇటీవల ఒక సినీ రాజకీయ నిర్మాత ఒకరు వెనక్కు తగ్గారట. ప్రభాస్ సినిమాలో పెట్టుబడి పెట్టాలి అని చూసినా సరే సరు గారికి కాస్త భయ౦ వేయడంతో వెనక్కు తగ్గారట. మరి ఇది ఎంత వరకు నిజం అనేది చూడాలి. ఇక సదరు నిర్మాత గారు ఇప్పుడు టాలీవుడ్ హీరోలతో కాస్త స్నేహం కూడా తగ్గించారు అని సమాచారం మరి. నిజమా కాదా అనేది చూడాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇప్పుడు నిర్మాతలు కూడా కాస్త భయపడుతున్నారు పెట్టుబడి విషయంలో.

మరింత సమాచారం తెలుసుకోండి: