మెగాస్టార్ చిరంజీవి ఇప్పటి వరకు ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమలో 150కి పైగా సినిమాల్లో నటించారు మెగాస్టార్ చిరంజీవి. ఇక ఈ క్రమంలోనే ఎన్నో సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి భార్య పాత్ర ల్లో ఎంతో మంది హీరోయిన్లు నటించారు. అయితే మెగాస్టార్ భార్యగా ఎంతమంది నటించినప్పటికీ ఒక్క హీరోయిన్ మాత్రం తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ గుర్తుండిపోతుంది. మెగాస్టార్ కి ధీటుగా  తన నటనతో ఆ హీరోయిన్ పాత్రలు ఆకట్టుకుంది అనే చెప్పాలి. ఆ హీరోయిన్ ఎవరో కాదు నగ్మా.. అప్పట్లో నగ్మా తన అందచందాలతో అభినయంతో ఎంతోమంది తెలుగు అభిమానులను సంపాదించుకున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్గా దశాబ్దకాలం పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో తన హవా నడిచింది.


దాదాపుగా తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలందరి సరసన నటించిన నటించింది నగ్మా. అయితే నగ్మా ఎంత మంది హీరోల సరసన నటించినప్పటికీ  చిరంజీవి భార్యగా నటించిన ఘరానా మొగుడు సినిమా మాత్రం తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ గుర్తుండిపోతుంది అనే చెప్పాలి. ఎంతో పొగరుబోతు లా ఉండే నగ్మా తన కంపెనీలో పనిచేసే ఒక సాదాసీదా కార్మికుడిని పెళ్లి చేసుకుంటుంది.



 తన భర్త అయిన చిరంజీవి పై పైచేయి సాధించడానికి నగ్మా ఎంతో ప్రయత్నిస్తూ ఉంటుంది. అయినప్పటికీ చిరంజీవి మాత్రం తనదైన శైలిలో నగ్మ ఎత్తులను చిత్తు చేస్తూ ఉంటాడు, ఇలా భార్యాభర్తలు అయినప్పటికీ ఈ సినిమాలో నగ్మా చిరంజీవి మధ్య  ఎప్పుడూ గొడవ జరుగుతూనే ఉంటుంది, పొగరుబోతు భార్య నగ్మా నటన ఈ సినిమాలో ఎంతో మందిని ఆకట్టుకుంది అనే చెప్పాలి.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: