చాలామంది హీరోయిన్లు హీరోలకు భార్య పాత్రలో నటిస్తూ అభినయం అందంతో ఆకట్టుకుంటూ ఉంటారు. కొంత మంది భార్య పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయి ఆ పాత్రకు సరిగ్గా సరిపోతూ  ఉంటారు, ఇలా భార్య పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న  హీరోయిన్లలో ఒకరు సిమ్రాన్. అప్పట్లో  స్టార్ హీరోయిన్ ని ఒక రేంజ్ లో హవా నడిపించింది. ఎన్నో ఏళ్ల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగి  ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించింది. ఈ క్రమంలోనే ఎన్నో సినిమాల్లో హీరోలకు భార్య పాత్రలో పిల్లలకు తల్లి పాత్రలో  కూడా నటించింది. ఎలాంటి పాత్రలోనైనా తన అభినయంతో ఆకట్టుకుంది సిమ్రాన్ .... ముఖ్యంగా ట్రెడిషనల్ లుక్ కి కేరాఫ్ అడ్రస్ గా ఉండే సిమ్రాన్ ఎప్పుడూ ఎక్కువగా చీరకట్టులోనే తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ ఉంది

అయితే ఓ వైపు పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకొని ప్రేక్షకులను అలరించినప్పటికీ  ఎక్కువ మొత్తంలో మాత్రం చీరలోనే అలరిస్తూ ఉండేది సిమ్రాన్. అయితే డాడీ సినిమాలో సిమ్రాన్ చిరంజీవికి భార్య పాత్రలో నటించిన విషయం తెలిసిందే, డాన్స్ ఇన్స్టిట్యూట్ నడుపుతున్న చిరంజీవినీ ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది సిమ్రాన్, ఆ తర్వాత ఎంతో బాధ్యతాయుతమైన ఇల్లాలుగా సిమ్రాన్ నటన ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఇక స్నేహితులకు సహాయం చేసి తన కూతురు ప్రాణం పోవడానికి భర్త కారణం అయ్యాడని అనుకున్న సిమ్రాన్ భర్త నుంచి దూరంగా ఉంటుంది.


ఇక ఆ తర్వాత పుట్టిన తన కూతురుని ఎంతో ప్రేమగా చూసుకోవడం... తల్లి తండ్రి తానే పెంచడం ఇలా తన హావభావాలతో ఎంతగానో ఆకట్టుకుంటుంది . అదే సమయంలో తన కూతురిని తండ్రికి దగ్గర కాకుండా చూడడం... ఒకవేళ తండ్రికి దగ్గరైతే  మళ్లీ ఎక్కడ ఈ  కూతురు కూడా దూరం అవుతుందో అనే హావభావాలను పండించడంలో సిమ్రాన్ తన నటనతో విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది అని చెప్పాలి.


Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: