తెలుగు చిత్ర పరిశ్రమలో యువ హీరో అల్లరి నరేష్ కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా హాస్యభరితమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటాడు అల్లరి నరేష్. అల్లరి సినిమాతో హీరోగా పరిచయమైన మొదటి సినిమానే తన ఇంటి పేరుగా మార్చుకున్నాడు, అయితే అల్లరి నరేష్ ఇప్పటివరకు ఎన్నో హాస్యభరితమైన సినిమాలో నటించి తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించాడు. అయితే ఈ రోజు అల్లరి నరేష్ తన పుట్టిన రోజు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. 

 

 ఈ క్రమంలో అల్లరి నరేష్ కీలక పాత్రలో నటిస్తున్న నాంది సినిమా టీజర్ విడుదల అయింది. నేరాలు ఖైదీలు శిక్షలు నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్గా సాగిపోయే ఈ టీజర్లో అల్లరినరేష్ ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా సరికొత్త నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. జైలులో అల్లరినరేష్ నగ్నంగా దర్శనమివ్వటం  ఈ సినిమా పై మరింత హైప్ తీసుకొచ్చింది . కొన్నేళ్లుగా మీరందరూ నా పై అంతులేని ప్రేమ విశ్వాసంతో ఆశ్చర్యపరిచారు సో ఈ పుట్టిన రోజు నేను మీ అందరినీ ఆశ్చర్యపరిచాలి  అని నిర్ణయించుకున్నాను అంటూ అల్లరి నరేష్ అభిమానులందరినీ సర్ప్రైస్  చేసాడు. 

 

 ఒక మనిషి పుట్టడానికి కేవలం తొమ్మిది నెలల సమయం పడుతుంది కానీ న్యాయం చెప్పడానికి ఎందుకు సార్ కి ఇన్ని సంవత్సరాల సమయం పడుతుంది అంటూ  టజర్ మొదలవుతుంది. ఇక ఈ టీజర్ మొత్తం అమాంతం ఆసక్తికరంగా మారిపోయింది అని చెప్పాలి. ఇక ఈ సినిమాతో కొత్త దర్శకుడు విజయ్ కనకమేడల టాలీవుడ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అయితే ఇప్పటివరకు హాస్యభరితమైన సినిమాల్లో నటించి మెప్పించిన అల్లరి నరేష్ ఈ సినిమాతో అందరిని ఆశ్చర్యపరిచాడు ఖాయం అని విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: