రాజమౌళి ప్రతీ సినిమాని చెక్కుతాడు. అందుకే అందరు రాజమౌళి ని జక్కన్న అంటారు. కథ ని వెండితెరమీద ఆవిష్కరించాలన్నా పాత్రకు తగ్గట్టు హీరోలని చెక్కాలన్నా టాలీవుడ్ లో రాజమౌళి తర్వాతే ఏ దర్శకుడైనా. అయితే వాటితో పాటు సినిమాకి పక్కా ప్రణాళిక అనేది చాలా ముఖ్యం. లేదంటే ఎక్కువగా దెబ్బ తినేది నిర్మాతే. అంతేకాదు కాస్ట్ ఫెల్యూర్ అంటే ఆ సినిమాకి నిర్మాతకంటే దర్శకుడి ఫ్లాపయ్యాడని చెప్పాలి.

 

ఇక సినిమాకి కొబ్బరికాయ కొట్టినప్పటి నుంచి గుమ్మడికాయ కొట్టి థియోటర్స్ లో సినిమా రిలీజయ్యో వరకు అన్నీ అనుకున్నట్టుగా సక్రమంగా జరిగితేనే నిర్మాతలు గట్టెక్కేస్తారు. అంతో ఇంతో లాభాలు చూస్తారు. మరో సినిమాకి సన్నాహాలు చేస్తారు. మరొకొన్ని కుటుంబాలకి ఉపాది దొరుకుతుంది. కాని రక రకాల కారణాల వల్ల గనక షూటింగ్ డేట్స్ పెరిగితే అంతే ..ఇక ఖర్చు తడిసి మోపెడవుతుంది. అలాంటిది నెలలకు నెలకు పోస్ట్‌పోన్ అవుతూ ఉంటే ఇక ఆ సినిమా పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అదే గనక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ అయితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఎవరైనా ఊహిస్తారా ..!

 

అలాంటి పరిణామాలే నిజంగా ఆర్.ఆర్.ఆర్ కి ఎదురవుతున్నాయట. మెగా పవర్ స్టార్ రాం చరణ్ ..యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోలుగా తయారవుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమా ఇప్పటికే చాలా ఆలస్యం అయింది.  వాస్తవంగా అయితే ఈ సమ్మర్ లో రిలీజ్ చేయాలనుకున్నది 2021 సంక్రాంతికి పోస్ట్ పోన్ అయింది. ఈ విషయాన్ని దర్శకుడు రాజమౌళి స్వయంగా వెల్లడించారు. కాని ఎప్పటి కప్పుడు షూటింగ్ డిలే అవుతుంది. పూణే లో అనుకున్న షెడ్యూల్ క్యాన్సిల్ అయింది. అదే షెడ్యూల్ ని గండిపేట లో నిర్వహించాలనుకున్నారు. కాని అక్కడ కూడా షూటింగ్ చేయడం కుదరలేదు. 

 

అయితే ఇప్పుడు ఈ షెడ్యూల్ ని నల్గొండ చుటూ పక్కల ప్రాంతంలో జరపడానికి రాజమౌళి లొకేషన్స్ ని చూస్తున్నారట. ఇక్కడ ముఖ్యంగా ఎన్.టి.ఆర్, రాం చరణ్, అజయ్ దేవగన్ ల మీద కీలక సన్నివేశాలని చిత్రీకరించనున్నారట. అయితే ఇక్కడైనా రాజమౌళి కి పరిస్థితులు అనుకూలిస్తాయా..లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన అఫీషియల్ న్యూస్ త్వరలో వెల్లడికానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: